NTV Telugu Site icon

Chandrababu: ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష..

Chandrababu Review

Chandrababu Review

Chandrababu: ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తాజాగా ఉన్న ఆర్థిక పరిస్థితిపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి ఉన్న అప్పులు లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా 14 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారుల ప్రాథమిక అంచనా వేశారు. పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై ఏపీ సీఎం సమీక్షించనున్నారు. పెండింగ్ బిల్లుల వివరాలు కోరుతూ ఇప్పటికే శాఖల వారీ వివరాలను ఆర్థిక శాఖ కోరింది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై ఫోకస్ పెట్టింది.

Read Also: Former MP Murali Mohan: రాజమండ్రి- మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి పర్మిషన్ తెచ్చింది నేనే

ఇక, పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ప్రవేశ పెట్టాలని ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ముందు ప్రతిపాదన పెట్టే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టే అంశంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేత పత్రంపై సీఎం కసరత్తు చేయనున్నారు. దీంతో పాటు మధ్యాహ్నం 3. 30 గంటలకు ఎక్సైజ్ శాఖ మీద కీలక సమీక్ష చేయనున్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ, గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత బీపీసీఎల్ ఛైర్మన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు.