NTV Telugu Site icon

CM Chandrababu: తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన.. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో స్పందించిన ఏపీ సీఎం..

Babu

Babu

CM Chandrababu: తాను చెప్పిన మాటలను 30 ఏళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో గుర్తు చెయ్యడం సంతోషం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గతంలో ఏ ఇజం లేదు టూరిజం ఒక్కటే అని తాను మాట్లాడితే తీవ్ర విమర్శలు చేశారన్నారు.. కలెక్టర్ల సమావేశంలో ఈ అంశాన్నే ప్రస్తావించారు సీఎం.. టూరిజంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు..

Read Also: Jr. NTR : నందమూరి తారక ‘రాముడు’ తో ఉన్న ‘లక్ష్మణుడు’ ఎవరంటే.?

తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ కలెక్టర్ల సదస్సులో రెండో రోజు చర్చ జరిగింది.. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో టూరిజంపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సభలో ప్రస్తావించారు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.. ఇప్పుడు సమాజంలో ఏ ఇజం లేదు.. ఉన్నదంతా టూరిజమే అని నాడు చంద్రబాబు అనేవారు అంటూ చెప్పుకొచ్చారు కూనంనేని.. చంద్రబాబు నాడు ఇజంపై చెప్పిన మాటే నిజం అంటూ తెలంగాణ సభలో అభిప్రాయపడ్డారు ఎమ్మెల్యే కూనంనేని.. అయితే, పత్రికలో వచ్చిన ఆ వార్తను కలెక్టర్ల సదస్సుల్లో టూరిజం అంశంపై మాట్లాడుతూ ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.. ఏ ఇజం లేదు అని నేను నాడు అంటే కమ్యునిస్టులు నాపై విరుచుకుపడ్డారు.. నాపై విమర్శలు చేశారు.. ఇప్పుడు తెలంగాణలో శాసన సభ్యుడు మాట్లాడతూ ఖర్చు లేని ఇజం టూరిజమే అంటూ నేడు స్టేట్మెంట్ ఇచ్చారు అని గుర్తుచేశారు.. తాను చెప్పిన మాటలను, తన ఆలోచనలను అర్ధం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టింది అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు..

Read Also: MA 2 : అసిస్టెంట్ డైరెక్టర్ కు నయన్ మధ్య గొడవ.. సినిమా క్యాన్సిల్..?

అయితే, ఇప్పుడు అంత సమయం లేదని.. త్వరగా ప్రాజెక్టులు తెచ్చి.. ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలన్నారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో ఇటు రాయలసీమ నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్దికి అనేక అవకాశాలు ఉన్నాయన్న చంద్రబాబు.. కలెక్టర్లు జిల్లాల వారీగా టూరిజం అభివృద్ది ప్రాజెక్టులపై శ్రద్ద పెట్టాలని సూచించారు.. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని.. ఎకనమీ పెరిగి.. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్నారు.. ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాధి కల్పించే రంగం టూరిజం అని వ్యాఖ్యానించారు.. ప్రతి జిల్లాలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని వాటికి అనుగుణంగా పనిచేస్తే టూరిజం పెద్ద ఉపాధి మార్గం అవుతుందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు..