CM Chandrababu: ఉప రాష్ట్రపతి ఎన్నికలపై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ సమిష్టిగా సీపీ రాధాకృష్ణన్ ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. సీపీ రాధాకృష్ణన్ ను కలిసి మా మామద్దతు ఉంటుందని, అభినందనలు తెలిపాం అన్నారు.. ఇక, దేశం గౌరవించదగ్గ వ్యక్తి సీపీ రాధాకృష్ణన్ అని వ్యాఖ్యానించారు.. దేశానికి, ఉపరాష్ట్రపతి పదవికి గౌరవం తీసుకొస్తారని ఆకాక్షించారు..
Read Also: Telangana Jobs : మరోసారి ఆరోగ్యశాఖలో ఉద్యోగాల జాతర.. 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ
తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది.. ఎన్డీఏ అభ్యర్థికే మా మామద్దతు ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు.. తెలుగు వ్యక్తి అన్నప్పుడు గెలిచే అవకాశాలు ఉంటేనే అభ్యర్థిని పెట్టాలని సలహా ఇచ్చారు.. గెలిచే అవకాశం లేకపోయినా అభ్యర్థిని పెట్టి “ఇండియా” కూటమి రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు.. అసలు మేం ఎన్డీఏలో ఉన్నప్పుడు ప్రతిపక్ష (ఇండియా కూటమి) అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తాం..? అని ప్రశ్నించారు.. ఆ రోజుల్లో పీవీ నరసింహారావు కోసం కాంగ్రెస్ పార్టీతో పోరాడుతున్నా.. మేం త్యాగం చేశామని గుర్తుచేసుకున్నారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణలోని కందుకూరు మండలం ఆకులమైలారానికి చెందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసిన విషయం విదితమే.. ఏపీ, తెలంగాణలోని అన్ని పార్టీలు జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.. కానీ, ఏపీలోని పాలక, ప్రతిపక్షాలు మొత్తం ఎన్డీఏకే మద్దతు ప్రకటించాయి..
