NTV Telugu Site icon

CM Chandrababu: 15 రోజుల్లో డ్రోన్ పాలసీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

Babu

Babu

CM Chandrababu: పదిహేను రోజుల్లో మేం ఒక డ్రోన్ పాలసీని తెస్తామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. అమరావతిలో జరుగుతోన్న దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ సమ్మిట్‌ 2024ను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలిసి ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 15 రోజుల్లోనే డ్రోన్ పాలసీ తీసుకొస్తాం.. ఓర్వకల్లు, కర్నూలు ప్రాంతంలో ఒక డ్రోన్ తయారీ కేంద్రంగా తీసుకురావాలన్నారు.. అన్ని ప్రధాన నగరాలకు కర్నూలు-ఓర్వకల్లు హబ్ దగ్గరలో ఉంటుంది.. కేంద్రానికి మేం ఇచ్చే అద్భుతమైన ప్రధాన అవకాశం ఇది అని పేర్కొన్నారు.. ఇక, నరేంద్ర మోడీ లాంటి టెక్నాలజీ అర్ధం చేసుకున్న ప్రధానిని చూడలేదన్న ఆయన.. నరేంద్ర మోదీ చేయలేరంటే.. ఇంకెవరూ చేయలేరన్నారు.. ఏపీ మొట్టమొదటి యూజర్ రాష్ట్రంగా ఉంటుంది.. భారతదేశ భౌగోళిక పతిస్ధితులు టెక్నాలజీకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.. అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం అన్నారు..

Read Also: AP and Meta Key MoU: మెటాతో ఏపీ స‌ర్కార్‌ కీలక ఒప్పందం.. ఇక, స‌ర్టిఫికెట్ల క‌ష్టాల‌కు చెక్‌..

ఇలాంటి ఒక డ్రోన్ సమ్మిట్ చాలా మంచిది.. ఇది ఒక మార్పు తీసుకొస్తుందన్నారు.. మనకు అడ్వాన్స్‌డ్ డ్రోన్స్, సీసీ కెమెరాలు, ఇతర ఐఓటీ పరికరాలు ఉన్నాయన్నారు. జాబ్ అడిగే వారు కావద్దు.. జాబ్స్ ఇచ్చే వారిగా మారాలన్నారు సీఎం చంద్రబాబు.. ఇక, తెలుగు కమ్యూనిటీ నుంచే 30 శాతం మంది జాబ్స్ ఇచ్చే వారుగా ఉన్నారన్న ఆయన.. ఎమిరేట్స్ నుంచి మొదటి ఫ్లైట్ హైదరాబాద్‌కు తెచ్చాం.. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కోసం అప్పటి ప్రధాని వాజ్ పేయిని ఒప్పించాను అని గుర్తుచేసుకున్నారు.. ఔటర్ రింగ్ రోడ్, బయో టెక్నాలజీ పార్క్, ఐటీ.. ఏది చెప్పినా.. అన్నీ తెచ్చాం.. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని బ్రాండ్ గా మార్చారు ప్రధాని మోడీ అన్నారు.. వికసిత్ భారత్ కోసం మోడీ పని చేస్తున్నారు.. 400 TB డేటా మనకు రాష్ట్రంలో ప్రతిరోజూ సమకూరుతోంది.. డిజిటల్ కరెన్సీ పై ఒక రిపోర్టు కావాలని ప్రధాని మోడీ నన్ను అడిగారు.. జనధన్, ఆధార్, మొబైల్ లను అనుసంధానం చేయడం.. జామ్ అనే దానిని ప్రధాని తీసుకొచ్చారు.. ఎంత డేటా ఉందనేదే రాబోయే రోజుల్లో ఆస్తి‌.. క్లౌడ్, డేటా.. ఊబరైజేషన్ చేయడం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఒక సక్సెస్ సాధిస్తాం అన్నారు.

Read Also: Kaleshwaram Investigation: రేపటి నుంచి రెండు విడతల్లో కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ

విజయవాడ వరదల్లో డ్రోన్ల ఉపయోగంపై మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వరదల్లో డ్రోన్ల నా సెక్రెటరీ సురేష్ ను అడిగాను.. నీరు డ్రైనేజీలలో నుంచి పోయినప్పుడు.. ఆ ప్రదేశాలను కూడా వరదల్లో డ్రోన్ ద్వారా గుర్తించాం.. డ్రోన్ ద్వారా డేటా కేరీ చేయచ్చు‌.. అలాగే వ్యవసాయానికి, క్రైం ఇన్వెస్టిగేషన్, ట్రాఫిక్, నేరాలు పరిశోధనకు డ్రోన్ వాడచ్చు అన్నారు. రౌడీషీటర్లకు ఛాలెంజ్… వాళ్లు క్రైం చేస్తే గంటల్లో పట్టుకునే విధానం తెస్తాం అని ప్రకటించారు.. వ్యవసాయంలో కూడా డ్రోన్ వినియోగం ఉంటుంది.. నిర్ణయాలు అప్పటికప్పుడే ఎలాంటి లోపం లేకుండా తీసుకోడానికి డ్రోన్ లు వాడచ్చు… డ్రోన్ తో మట్టి పరీక్షలు చేయచ్చు.. 70 శాతం రోగులు అనసరంగా అడ్మిట్ అయ్యి డబ్బులు కడుతున్నారు.. డ్రోన్ వినియోగం ద్వారా రోగులు ఆసుపత్రిలో అనవసరంగా అడ్మిట్ అవ్వకుండా చూడచ్చు అన్నారు.. ఏపీలో డ్రోన్ కంపెనీలు తాము తయారు చేసిన అప్లికేషన్స్ టెస్ట్ చేసుకోవచ్చు.. నాకు డ్రోన్ కంపెనీల నుంచీ ఏపీలో ఏం కావాలో అడుగుతాను.. యుద్ధాలలో డ్రోన్ లను వినియోగిస్తున్నారు… ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఒక ఉదాహరణగా పేర్కొన్నారు.. ఇండియా ప్రపంచ వ్యాప్తంగా నాలెడ్జి ఎకానమీతో పని చేయగలదు.. ఏపీ ఎకో సిస్టంను బలపరిచేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ కోసం‌ సిద్ధం చేస్తాం.. ఇన్వెస్టర్లు, సర్వీస్ ప్రొవైడర్లు కోసం ప్రత్యేక ప్లాట్ ఫాంగా ఏపీ ఉంటుంది.. డ్రోన్ టెక్నాలజీలో అభివృద్ధి చేయగల పరిస్ధితిలోకి ఏపీ వస్తుందని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు..