AP Cabinet Meeting: రేపే ఏపీ కేబినెట్‌ భేటీ.. వాటిపైనే ఫోకస్‌..

  • సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపే ఏపీ కేబినెట్ భేటీ..
  • ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం..
  • పలు కీలక అంశాలపై చర్చ.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్..
Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.. ముఖ్యంగా 43వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. ఇక, పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్ లో చర్చ సాగనుంది.. మరోవైపు.. సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు.. ఇక, రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడుల అంశంపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.

Read Also: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ న్యూ లుక్.. కొత్త హెయిర్ స్టైల్ (వీడియో)

కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్‌ పెట్టింది.. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించేందుకు సిద్ధమైంది.. ఇప్పటికే సీఆర్డీఏ పలు పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. మూడేళ్లలోనే రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మంత్రి నారాయణ.. ఈ నేపథ్యంలో జరగనున్న కేబినెట్‌ సమావేశంలో సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుందట.. మరోవైపు.. కాకినాడ పోర్ట్‌లో పీడీఎస్‌ రైస్‌ పట్టుబడిన వ్యవహారం సంచలనం సృష్టించింది.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రంగంలోకి దిగడం కూడా చర్చగా మారింది.. ఈ తరుణంలో పీడీఎస్‌ రైస్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది..