Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి పార్థసారథి.. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.. రాష్ట్రంలో రూ.22 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేపట్టడంతో 19 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. నిర్దేశిత టైమ్‌లైన్ ప్రకారం పనులు ప్రారంభించని సంస్థల అనుమతులను రద్దు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అమరావతి అసెంబ్లీకి డిజైన్లు ఆమోదం
అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ భవనానికి సంబంధించిన డిజైన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏ దేశంలో లేని విధంగా అసెంబ్లీ భవన నిర్మాణం చేపడుతున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. తెలుగు ప్రజలందరూ గర్వించేలా భవనం ఉండే విధంగా నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. మూడేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు ఇక, కృష్ణాయపాలెం స్కూల్ ప్లాట్–4లో ఐదు ఎకరాల భూమిని నలంద అకాడమీకి లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 70:30 క్యూసీబీఎస్ విధానంలో అత్యధిక స్కోరు సాధించిన ఎల్–1 బిడ్డర్‌గా నలంద అకాడమీ ఎంపికైంది. భూమి కేటాయింపు ప్రక్రియకు ఏపీసీఆర్డీఏ కమిషనర్‌కు అధికారాలు కల్పించే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది.
Also Read
- AP Inter Exams 2027: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 2027 పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ విడుదల
- Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
- AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ, డీఆర్
ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేబినెట్.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ, డీఆర్ మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2020 జూలై 1 నుంచి 2.73 శాతం, 2021 జనవరి 1 నుంచి 1.82 శాతం డీఏ, డీఆర్ మంజూరు చేయనున్నారు. ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్లు 119, 120, 121, 122కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
2026–27 మద్యం దుకాణాలకు కొత్త ఎక్సైజ్ విధానం
2026–27 కాలానికి మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించిన ఎక్సైజ్ విధాన మార్గదర్శకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఎక్సైజ్ రూల్స్–2024లో సవరణలకు సంబంధించిన జీవోలను రాటిఫై చేసింది. రాష్ట్ర ఆదాయానికి నష్టం వాటిల్లకుండా మద్యం లైసెన్సుల పొడిగింపు విధానంపై నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాల్లో ఎంఆర్పీ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తొలిసారి ఎంఆర్పీ ఉల్లంఘనకు పట్టుబడితే రూ.10 లక్షల జరిమానా విధించే ప్రతిపాదన ఉంది. రెండోసారి ఉల్లంఘనకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఎంఆర్పీ ఉల్లంఘనలపై స్పందించని ఉద్యోగులు, శాఖలపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖాళీ మద్యం బాటిళ్లను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా రీసైక్లింగ్‌ను ప్రోత్సహించే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నారు. వినియోగదారులకు బాటిల్‌కు రూ.5 లేదా రూ.10 విలువ చెల్లించే విధానంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
బీచ్ మినరల్స్ మైనింగ్ ప్రాజెక్టుకు చర్యలు
శ్రీకాకుళం నుంచి భీమిలి వరకు ప్రతిపాదిత బీచ్ అండ్ మినరల్స్ మైనింగ్ ప్రాజెక్టుకు సంబంధించి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కంపల్సరీ ఎఫారెస్టేషన్ ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుకు 1,618.265 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ఆమోదం లభించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం బ్రహ్మసముద్రంలో ఈ భూముల కేటాయింపు జరగనుంది. సర్వే నంబర్ 84లో 1,234 ఎకరాలు, సర్వే నంబర్ 85లో 364 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
విజయనగరంలో మహిళా సాధికారతకు భూమి
విజయనగరం మండలం వేణుగోపాలపురం బిట్–2లో 13.29 ఎకరాల ప్రభుత్వ భూమిని డీఆర్డీఏకు కేటాయించేందుకు ఆమోదం లభించింది. మిల్లెట్స్ ప్రాసెసింగ్ సెంటర్, బయోగ్యాస్ ప్లాంట్, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, నేచురల్ ఫార్మింగ్ డెమో ప్లాట్లు, స్వయం సహాయక సంఘాల శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఈ భూమిని వినియోగించనున్నారు. మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకుని భూమిని ఉచితంగా కేటాయించాలని సీఎం సూచించగా, కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు, పెద్దదూడియాల ప్రాంతాల్లో 7.2 ఎకరాల ప్రభుత్వ భూమిని 126 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు కోసం ఆంప్లస్ ఐఎఫ్ఎస్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. మార్కెట్ విలువ చెల్లింపు ప్రాతిపదికన భూమి కేటాయించనున్నారు.
కృష్ణా యూనివర్సిటీకి 102.85 ఎకరాలు
మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామంలోని 102.85 ఎకరాల ప్రభుత్వ భూమిని కృష్ణా యూనివర్సిటీకి బదలాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సంబంధిత సర్వే నంబర్లలోని భూమిని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు కేటాయించనున్నారు. విద్యాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మార్కెట్ విలువకు బదులుగా ఎకరాకు రూ.10 వేల ధర నిర్ణయించి భూమిని విక్రయించాలన్న సీఎం సూచనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు.. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో 11.7 ఎకరాల ప్రభుత్వ భూమిని పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీ నెల్లూరుకు కేటాయించేందుకు క్యాబినెట్ అనుమతించింది. మార్కెట్ విలువ చెల్లింపు ప్రాతిపదికన భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. వాపట్ల మండలం అడవి గ్రామంలో ఎకరం ప్రభుత్వ భూమిని పర్యాటక అభివృద్ధికి కేటాయించాలని నిర్ణయించారు. సర్వే నంబర్ 547/3ఏలోని భూమిని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ విజయవాడకు కేటాయించనున్నారు. పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి బుక్ అడ్జస్ట్మెంట్ ద్వారా భూమి కేటాయింపు చేపట్టనున్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఇక పండగే..
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాలసీకి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్.. ఐదు ర్రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు ఉన్న పాలసీలకు సంబంధించి చర్చించి పారితోషకంపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పార్థసారథి వెల్లడించారు.. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ పారితోషికం ఇస్తున్నాయని.. కేటగిరి ఏలో లక్ష వ్యూస్ కన్నా ఎక్కువగా ఉండాలని తెలిపారు.. ఇక, లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్న వారికి ఈ పాలసీ కింద గరిష్టంగా రూ.15 వేల చొప్పున చెల్లించాలని నిర్ణయించారు.. మరోవైపు 50 వేల నుంచి 99,999 వరకు ఫాలోవర్లు ఉన్న వారికి 7,500 రూపాయలు అందజేయనున్నారు.. ఇక, 25 వేల నుంచి 49,999 మంది ఫాలోవర్లు ఉన్న వారికి 5 వేల రూపాయలు.. 10 వేల నుంచి 24,999 వరకు ఫాలోవర్లు ఉన్న వారికి 2,500 రూపాయల వరకు వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం..
జగన్‌పై మంత్రి పార్థసారథి విమర్శలు
మాజీ సీఎం జగన్‌పై మంత్రి పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌కు తన ఇల్లే అసెంబ్లీగా మారిందని, అక్కడి నుంచే అబద్ధాలు, విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇతర దేశాల్లో ఉండే మాఫియా డాన్లు అక్కడి నుంచే విధ్వంసాలు చేయించినట్లుగా, జగన్ పక్క రాష్ట్రంలో కూర్చుని రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. డీఎస్సీ విషయంలోనూ యువతలో అలజడి కలిగించే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. కోడిగుడ్డు ఎవరి కోసం తెచ్చారంటూ ప్రశ్నించారు మంత్రి కొలుసు పార్థసారథి..
తాజావార్తలు
-
Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
-
Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
Ram Charan: “మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న” చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
-
AP Inter Exams 2027: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 2027 పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ విడుదల
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!