Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్‌లు..! ప్రత్యేక మెకానిజం

Social Media Monitoring

Social Media Monitoring

Social Media Monitoring: సోషల్ మీడియా అంశంపై ఏపీ కేబినెట్‌ ఎజెండా తర్వాత సీరియస్ గా చర్చ జరిగింది.. సోషల్‌ మీడియాకు సంబంధించి ఒక ప్రత్యేక మెకానిజం రావాలన్నారు సీఎం చంద్రబాబు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై చర్చ జరిగింది… సోషల్ మీడియాకు సంబంధించి.. పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్ ఇచ్చారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా… అవసరం అయితే కేంద్రాన్ని కూడా. సంప్రదించి నిర్ణయం. తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నేతలను కించపరుస్తూ వస్తున్న వీడియోలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే అభ్యంతరకర వ్యాఖ్యలను మాత్రం ఉపేక్షించవద్దని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

సోషల్ మీడియా అంశంలో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.. ఇందుకోసం అవసరమైతే బయటనుంచి సిబ్బందిని తీసుకోవాలని పోలీస్ శాఖకు ఆదేశాలు అందాయి.. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అవసరమైతే కొత్తగా పీపీలను నియించుకోవాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.. ప్రభుత్వంపై అభూత కల్పనలు, అసత్యాలు, అసలు విషయాలు వక్రీకరిస్తే మాత్రం ఉపేక్షించవద్దని గట్టిగా కోరారు మంత్రులు. ఈ రోజు నుంచే పోలీస్ యంత్రాంగం సోషల్ మీడియాపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని ఆదేశాలు ఇచ్చారు.

ఇప్పటికే సోషల్ మీడియాపై ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీలో కూడా చర్చించాలని ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు.. వైసీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం పై నుంచి దృష్టి మరల్చేందుకు కొత్త పద్ధతి ఎన్నుకున్నారని మంత్రులకు చెప్పారు సీఎం చంద్రబాబు… వారు కావాలని మన MLAలను రెచ్చగొడుతున్నారన్న సీఎం చంద్రబాబు…. వైసీపీ వాళ్లు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని మంత్రులకు సూచించారు… మనలను ట్రాప్ లోకి లాగుతున్నారని జాగ్రత్తగా ఉండాలన్నారు.. అనంతపురం, మిగతా జిల్లాలలో జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు సీఎం.. అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు చంద్రబాబు.. ఇంఛార్జ్‌ మంత్రులు జిల్లాలకు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.. ఇంఛార్జ్‌ మంత్రులు రెవెన్యూ, ఇతర సమస్యలపై కూడా దృష్టి సారించాలన్నారు.. ఆయా జిల్లాలో ప్రతి అంశంపై ఇంఛార్జ్‌ మంత్రులు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు సీఎం చంద్రబాబు..