Site icon NTV Telugu

AP Assembly Session: ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు.. నేడు సభ ముందుకు కీలక బిల్లులు

Ap Assembly 2024 4th Day

Ap Assembly 2024 4th Day

AP Assembly Session: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఆరవ రోజు కొనసాగనున్నాయి.. ముందుగా ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఇక, అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ వార్షిక ఆడిట్ రిపోర్టు, 2017-18, 2018-19, గత ప్రభుత్వ హయాంలో రిపోర్టులు, ఆలస్యం అవడానికి కారణాలను సభ ముందు ప్రవేశ పెట్టనున్నారు మంత్రి పొంగూరు నారాయణ.. డివిజినల్ రైల్వే యూసర్స్ కన్సల్టేటివ్ కమిటీలో ప్రతినిధిగా ఎంఎల్ఏలలో ఒకరిని ఎన్నుకోవడానికి అసెంబ్లీ ముందుకు తీసుకురానున్నారు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.. 2024-25 గ్రాంట్స్ కోసం డిమాండ్స్ పై చర్చ.. ఓటింగ్ నిర్వహించనున్నారు..

Read Also: Kantara 2 : కాంతారా 2 రిలీజ్ అయ్యేది అప్పుడే.. అప్ డేట్ వచ్చేసిందోచ్

ఇక, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పంచాయితీరాజ్ డిమాండ్ కింద 11,846.92 కోట్ల గ్రాంట్.. గ్రామీణాభివృద్ధి గ్రాంట్ కింద 7949.87 కోట్ల గ్రాంటు.. అటవీ, సాంకేతిక, నైపుణ్య, పర్యావరణం కింద 687.58 కోట్ల గ్రాంట్స్‌ సభ ముందు పెట్టనున్నారు.. మంత్రి నారా లోకేష్.. పాఠశాల విద్య కింద 29,909.31 కోట్ల గ్రాంట్.. ఉన్నతవిద్య కింద 2326.68 కోట్ల గ్రాంట్.. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కింద 1217.16 కోట్ల గ్రాంట్.. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ కింద 500.51 కోట్ల గ్రాంట్ పెట్టబోతున్నారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్.. వైద్యం ఆరోగ్యం కింద 18421.04 కోట్ల గ్రాంట్.. మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.. సోషల్ వెల్ఫేర్ కింద 10,400.84 కోట్ల గ్రాంట్.. మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. మహిళా, శిశు సంక్షేమం కింద 4285.95 కోట్ల గ్రాంట్.. ఆదివాసీ సంక్షేమం కింద 4541.86 కోట్ల గ్రాంట్.. లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్ గ్రాంట్ ఎన్ఎండీ ఫరూఖ్.. మైనారిటీల సంక్షేమం కింద 2808.75 కోట్ల గ్రాంట్.. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ 1227 కోట్లు గ్రాంట్ సభ ముందు పెట్టబోతున్నారు..

Read Also: Astrology: నవంబర్ 18, సోమవారం దినఫలాలు

మరోవైపు కీలక బిల్లులు ఈ రోజు అసెంబ్లీ ముందుకు రాబోతున్నాయి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. ఏపీ పంచాయితీరాజ్ సవరణ బిల్లు 2024.. మంత్రి పొంగూరు నారాయణ.. ఏపీ మున్సిపల్‌ లా సవరణ బిల్లు 2024.. మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024.. ఏపీ ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024.. ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024.. మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024.. మంత్రి అచ్చెం నాయుడు.. ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు 2024ను ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు..

Exit mobile version