AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించినట్లు, రేపు రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో, కొందరు జిల్లాల్లో వర్షాలు కురియనుండగా.. మరికొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది..
పిడుగులతో కూడిన వర్షాలు..
మంగళవారం రోజు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో కూడా పలుచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది..
వడగాల్పుల హెచ్చరిక
రాష్ట్రంలో కొన్ని మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా తీవ్ర వడగాల్పులు వీచే మండలాలు ఎనిమిది ఉన్నాయి.. పార్వతీపురం (మన్యం జిల్లా) గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస, కొమరాడ, కురుపాం, సీతానగరం.. పోలవరం జిల్లా చింతూరు, కూనవరం ఉన్నాయి.. ఇక వడగాల్పులు వీచే మండలాలు 13 ఉన్నాయి.. విజయనగరం జిల్లా బాడంగి, మెరకముడిదాం, తెర్లాం, వంగర, పార్వతీపురం (మన్యం జిల్లా) బలిజిపేట, భామిని.. పోలవరం జిల్లా దేవిపట్నం, ఎటపాక, వరరామచంద్రాపురం.. తూర్పు గోదావరి జిల్లా కోరకొండ, సీతానగరం.. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఉన్నాయి.. విపత్తుల సమయంలో వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల క్రింద, పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు సూచించారు.
ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
కడప జిల్లా (ఒంటిమిట్ట, ఖాజీపేట) – 42.5°C
కర్నూలు జిల్లా (లద్దగిరి) – 41.3°C
అనంతపురం జిల్లా (యల్లనూరు, పాతకొత్తచెరువు) – 40.5°C
నెల్లూరు జిల్లా (కొమ్మిపాడు) – 40.5°C
మార్కాపురం జిల్లా (పిటికాయగుల్ల) – 40.3°C
నంద్యాల జిల్లా (గుల్లదుర్తి) – 40.3°C
తిరుపతి జిల్లా (నాగలాపురం) – 40.1°C