Ambati Rambabu: కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు తుస్సుమంది అంటూ సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు ప్రసంగం మొత్తం అభద్రతాభావం కనిపించింది.. కడప మహానాడు తుస్సుమంది.. ప్రజలను డైవర్ట్ చేయటానికి కామెడీ ఆర్టిస్ట్ లను తీసుకువచ్చారు.. ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాల సమయంలో కూడా జగన్ ను తిట్టించటం కింద నవ్వుకోవటం.. మేం మీ మీద ఇలా మీ మీద మాట్లాడలేమా..? అని ప్రశ్నించారు.. మాట్లాడితే తల్లి, చెల్లి అంటారు.. మీ గృహ ప్రవేశానికి మీ చెల్లెళ్లను పిలిచారా..? మహానాడులో గావు కేకలతో మాట్లాడి సక్సెస్ అయ్యింది అని చెప్పుకుంటున్నారు.. లోకేష్ గారికి ముందుంది ముసళ్ల పండగ.. ఆయన అనుభవం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.. మామీద కేసులు పెడుతున్నారు.. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు గుర్తు పెట్టుకోండి అని హెచ్చరించారు..
Read Also: MLA Raja Singh : బక్రీద్ పండుగ ఎలా జరుపుకుంటారో మాకు అనవసరం.. కానీ..
కూటమి ప్రభుత్వం హామీలు అమలు కాకపోవడంతో వెన్నుపోటు దినంగా జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్లలో నిరసన తెలపాలని పిలుపునివ్వడంతో నేడు మంగళగిరి వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అధ్యక్షతన అన్ని నియోజకవర్గాల ఇంఛార్జ్‌లతో వైసీపీ కార్యకర్తల సమక్షంలో సమావేశం నిర్వహించారు.. జూన్ 4న జరగబోయే వెన్నుపోటు దినంను జయప్రదం చేయాలని మాజీ మంత్రి అంబటి కోరారు.. ఇక, మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మంత్రి లోకేష్ ఓ పిల్ల సైకోల ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు.. రాష్ట్రంలో సీఐ దగ్గర నుంచి డీఎస్పీ వరకు ఎవరి పోస్ట్ మారాలన్న సూట్ కేసులు అందించాల్సిందే అని కామెంట్ చేశారు.. రాజధాని పేరుతో వేలకోట్ల రూపాయలు కొడుకు ద్వారా అక్రమ సంపాదనను సంపాదిస్తున్నారు చంద్రబాబు… చంద్రబాబు స్టీరింగ్ లోకేష్ చేతిలో పెట్టారు.. అది ఎప్పుడో గుద్దుతాడు జాగ్రత్త అని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు అడగ్గానే పవన్ కల్యాణ్ తిక్కలోడిలాగా ఎక్కడపడితే అక్కడ సంతకాలు పెట్టేస్తున్నాడు.. చంద్రబాబు పథకాలను బీజేపీ నమ్మలేదు కాబట్టే సంతకం పెట్టకపోగా.. కనీసం పట్టుకునే సాహసం కూడా చేయలేదు.. లోకేష్ తెలివి తక్కువ ఇన్ మెచ్యూర్ పొలిటిషన్‌గా ప్రవర్తిస్తున్నాడు, చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోతే పారిపోయి కుప్పంలో పోటీ చేశాడు మంగళగిరిలో ఓడిపోయి ఇక్కడే గెలిచాను అని మీ నాన్నకు చెప్పు మళ్లీ ఇక్కడే ఓడిపోతావు అంటూ అంబటి రాంబాబు లోకేష్‌ను విమర్శించారు..
