Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Land Pooling: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో విడత భూసమీకరణ ప్రక్రియకు అడుగులు పడ్డాయి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో ల్యాండ్ పూలింగ్ కోసం క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (CRDA) నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజధాని ప్రాంతంలో కీలకమైన మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా భూములను సమీకరించేందుకు ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. మోతడక గ్రామంలో చేపట్టనున్న ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించిన భూములను ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణానికి వినియోగించనున్నట్లు సీఆర్డీఏ పేర్కొంది. అమరావతి రాజధాని ప్రాంతంలో భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ భూసమీకరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
మోతడకలో 2,344.12 ఎకరాల భూమి
సీఆర్డీఏ వివరాల ప్రకారం మోతడక గ్రామంలో మొత్తం 2,344.12 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1,654.259 ఎకరాల పట్టా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించనున్నారు. మిగిలిన భూమి ప్రభుత్వానికి చెందినదిగా సీఆర్డీఏ పేర్కొంది. అయితే, అమరావతిలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, తాజాగా మోతడకలో నోటిఫికేషన్ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ వంటి కీలక ప్రాజెక్టులకు అవసరమైన భూమిని సమీకరించడంతో రాజధాని ప్రాంతంలో రవాణా మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది.
Also Read
- Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
ఇక, ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో వివిధ పనులకు సంబంధించిన పరిపాలన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. 596 కోట్ల రూపాయలో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, మరోవైపు 1,430 కోట్ల రూపాయాలతో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు అనుమతులు లభించినట్టు మంత్రి నారాయణ పేర్కొన్నారు.. ఇక, రాజధాని పరిధిలోని 29 గ్రామాల లేఅవుట్ రోడ్లను బీటీగా అభివృద్ధి చేసేందుకు ఆమోదం లభించగా.. అమరావతి నుంచి మంగళగిరికి తాగునీరు అందించేందుకు అంగీకరించారు..
తాజావార్తలు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!