Site icon NTV Telugu

Pemmasani Chandrasekhar: పార్లమెంట్లో అమరావతి బిల్లు పెడుతాం..

Csk

Csk

Pemmasani Chandrasekhar: అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు ఈ పార్లమెంట్ సమావేశాల్లో కానీ, వచ్చే సమావేశాల్లో గానీ బిల్లు పెడతామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 2014 నుంచి రాజధానిగా గుర్తించాలా.. లేక ఇప్పటి నుంచి గుర్తించాలా అనే సాంకేతిక కారణాలతో ఆలస్యం జరుగుతుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి బిల్లును మానిటర్ చేస్తున్నారు.. అమరావతి బిల్లు పై జగన్ విషం కక్కుతున్నారు అని ఆరోపించారు. జగన్ ను శాశ్వత రాజకీయ సమాధి చేయాలి.. జగన్ కి పని చేత కాలేదని పెమ్మసాని పేర్కొన్నారు.

Read Also: Fatty Liver : మద్యం తాగకపోయినా ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందో తెలుసా..

ఇక, 34 వేల మంది రైతులు ఇచ్చిన భూములు వినియోగించుకోలేక ఏపీ భవిష్యత్ ను నాశనం చేశారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తెలిపారు. ప్రణాళికా బద్దంగా అమరావతి అభివృద్ధి చేస్తున్నాం.. అమరావతి బిల్లు సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతుంది.. వేల మంది అమరావతి నిర్మాణం పని చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే 16 జాతీయ సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.. హడ్కో ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.. CAG, పోస్టల్ బిల్డింగ్, కేంద్రీయ విద్యాలయాలు అమరావతిలో ఏర్పాటు అవుతున్నాయి.. ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రశేఖర్ అన్నారు.

Exit mobile version