NTV Telugu Site icon

AP High Court: అల్లు అర్జున్ పిటిషన్‌, జత్వాని కేసు సహా.. నేడు హైకోర్టులో కీలక విచారణలు

Ap High Court

Ap High Court

AP High Court: నేడు ఏపీ హైకోర్టులో కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది.. సినీ హీరో అల్లు అర్జున్‌ పిటిషన్‌ సహా.. ముంబై నటి జత్వాని కేసు సహా పలు పిటిషన్లు విచారణకు రానున్నాయి.. ఏపీ హైకోర్టులో హీరో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు.. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్యాష్ చేయాలని పిటిషన్ వేశారు అల్లు అర్జున్.. ఇక, ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది..

Read Also: Diwali Special Trains: దీపావళికి 804 ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికుల కోసం UTS మొబైల్ యాప్..

ఇక, ముంబై నటి జత్వాని కేసులో ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ కొనసాగనుంది.. గత విచారణలో నేటి వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దంటూ హైకోర్టు ఆదేశించిన విషయం విదితమే.. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఐపీఎస్ అధికారులు కాంతిరానా టాటా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్ ఇంకొల్లు.. అయితే, ఇదే కేసులో ఇంప్లిడ్ అయ్యారు సినీనటి జత్వాని.. ఆ పిటిషన్లపై నేడు మరోసారి విచారణ చేపట్టనుంది హైకోర్టు.

Read Also: Goat Milk Benefits: అయ్యా బాబోయ్.. మేక పాల వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా

మరోవైపు.. జత్వాని కేసులో కుక్కల విద్యాసాగర్ కస్టడీ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణకు రానుంది.. వారం రోజుల పాటు విద్యాసాగర్‌ కస్టడీ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు పోలీసులు. ఈ కేసులో విద్యాసాగర్‌ A1గా ఉన్న విషయం విదితమే.. అయితే, కస్టడీ పిటిషన్‌పై 4th Acmm కోర్టులో విచారణ జరగనుంది.. ఇక, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.. కడియం పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ బుచ్చయ్య చౌదరి దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది.. ఇలా నేడు ఏపీ హైకోర్టులో కీలక కేసుల విచారణ జరగనుంది..