NTV Telugu Site icon

AP Weather Update: అలర్ట్.. ఈ జిల్లాల్లో 3 రోజులు పిడుగుల వర్షం.. ఆ జిల్లాల్లో తీవ్ర ఎండలు..!

Thunderstorm

Thunderstorm

AP Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి.. మరో వైపు వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. అయితే, రేపు, ఎల్లుండి, ఆ తర్వాత రోజు.. మూడు రోజుల పాటు రాష్ట్రంలో భిన్నవాతావరణం ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది.. మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత పెరగనుండగా.. మరోవైపు.. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.. ఈ సమయంలో పిడుగులు పడతాయని వార్నింగ్‌ ఇచ్చింది వాతావరణశాఖ..

Read Also: UP: “డ్రమ్ మర్డర్” భయం.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేయించిన భర్త.. ఈ కథలో మరో ట్విస్ట్..

రేపు, ఎల్లుండి, ఆ తర్వాత రోజు కూడా పిడుగుల వర్షం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.. బుధవారం (02-04-25) శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని.. గురువారం రాయలసీమ జిల్లాలు, అల్లూరి సీతరామరాజు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, శుక్రవారం ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.. అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని పేర్కొంది వాతావరణశాఖ..

Read Also: Jio: క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్.. అన్ లిమిటెడ్ ఆఫర్ గడువును పొడిగించిన జియో

ఇక, ఏపీ లో కొన్ని జిల్లాలకు తీవ్ర ఎండల ప్రభావం ఉంటుందన్నారు.. బుధవారం (02-04-25) శ్రీకాకుళం జిల్లా-6, విజయనగరం జిల్లా-5, పార్వతీపురంమన్యం జిల్లా-11, అల్లూరి సీతారామరాజు జిల్లా-5, కాకినాడ-1, తూర్పుగోదావరి-2 మండలాల్లో (30) వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు.. ఇక, గురువారం 47 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందని అంచనా వేశారు..