Site icon NTV Telugu

Speaker Ayyannapatrudu: రేపటి నుంచి అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు.. స్పష్టం చేసిన స్పీకర్

Ap Assembly Session

Ap Assembly Session

Speaker Ayyannapatrudu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. అయితే, అసెంబ్లీలో రేపటి నుంచి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత హాజరు నమోదు విధానం అమల్లోకి రానుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సభ్యులు తమ కేటాయించిన స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదయ్యే విధంగా ఈ వ్యవస్థను రూపొందించామని తెలిపారు. పార్లమెంటులోనూ ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సాంకేతికతను వినియోగించి అసెంబ్లీ కార్యకలాపాలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యమని చెప్పారు.

Read Also: Ambati Rambabu bail: అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్.. మాజీ మంత్రికి మరో కేసులోనూ బెయిల్

ఈసారి అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లోనే సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ వెల్లడించారు. అలాగే అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలకు ఏప్రిల్ నెలాఖరులో గృహప్రవేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ అసెంబ్లీ భవన నిర్మాణాన్ని ప్రణాళికబద్ధంగా చేపట్టామని స్పీకర్ పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని కొత్త అసెంబ్లీలో 300కు పైగా సభ్యులు కూర్చునేలా సీటింగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2028 డిసెంబర్ నాటికి కొత్త అసెంబ్లీ భవనం అందుబాటులోకి తీసుకురావాలని నిర్మాణ సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయని స్పష్టం చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు..

Exit mobile version