AP and Karnataka: ఆరు అంశాలపై ఏపీ, కర్ణాటక మధ్య ఒప్పందం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడి..
- ఏపీ.. కర్ణాటక మధ్య కీలక ఒప్పందాలు..
- ఆరు అంశాలపై ఎంవోయూలు..
- రెండు రాష్ట్రాల మధ్య దేశంలోనే ఇలాంటి ఎంఓయూ గతంలో లేదన్న పవన్..
- ఆరు అంశాలపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నాం అని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP and Karnataka: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆరు కీలకమైన ఒప్పందాలు జరిగాయి.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కల్యాణ్‌తో కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే సమావేశం అయ్యారు.. ఈ భేటీలో రెండు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. చిత్తూరు, మన్యం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో పంటపొలాల పై ఏనుగుల దాడి అంశాలు మా దృష్టికి మీడియా తీసుకొచ్చింది.. పంటపొలాల పై ఏనుగుల దాడి అంశంలో కర్ణాటక నుంచి సహాయం అందుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు.. రెండు రాష్ట్రాల మధ్య దేశంలోనే ఇలాంటి ఎంఓయూ గతంలో జరగలేదు పవన్ కల్యాణ్.. ఏపీ, కర్ణాటక మధ్య ఆరు అంశాలపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నాం అని వెల్లడించారు..
ఆరు అంశాలు
1. ఏనుగులకు మనుషులకు మధ్య ఎలా ఉండాలి అనే అంశం
2. మావటీలకు కావటీలకు శిక్షణ
3. కుంకీ ఏనుగులను ఏపీకి తరలింపు
4. ఏనుగుల శిబిరాల సంరక్షణ, ఆహారం
5. ఎర్రచందనం, శ్రీగంధం సమస్యలకు జాయింట్ టాస్క్ ఫోర్స్..
6. అడవులలో ఏం జరుగుతుందో రియల్ టైంలో తెలిసేలా ఐటీ అభివృద్ధి.
Also Read
- CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
ఇక, ఎకో టూరిజంను అభివృద్ధి చేయడంలో కర్ణాటక తీసుకొచ్చిన విధానాలు ఏపీకి వచ్చేలా నిర్ణయం తీసుకున్నట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు.. రెండు రాష్ట్రాల పీసీసీఎఫ్ లు కలిసి పనిచేస్తాయి.. పార్టీల పరంగా కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు వేరైనా.. ప్రజల కోసం కర్ణాటక ప్రభుత్వం ముందుకొచ్చింది.. వంద కోట్ల విలువైన ఎర్రచందనం కర్ణాటకలో పట్టుకున్నారు.. ఎర్రచందనం స్మగ్లర్లు తమిళనాడు నుంచి ఎక్కువగా వస్తున్నారని పేర్కొన్నారు..
తాజావార్తలు
-
Nellore: కోడూరు బీచ్‌లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్‌ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్‌లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!