Marigold Farmers: దసరా వేళ బంతిపూలకు ధరలేవీ? రైతులకు తీవ్ర నిరాశ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marigold Farmers: దసరా వేళ సిటీల్లో పూల ధరలు మండిపోతున్నాయి.. సద్దుల బతుకమ్మ, దసరా నేపథ్యంలో.. పెద్ద నగరాల్లో రూ.60, రూ.70, రూ.90, రూ.100 ఇలా కిలో బంతుపూలు విక్రయిస్తున్నారు.. అయితే, అల్లూరి జిల్లా పాడేరులో బంతిపూల రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. దసరా పండుగ సందర్భంగా బంతిపూలకు మంచి ధర లభిస్తుందని ఆశించిన ఆదివాసీ రైతులకు నిరాశే మిగిలింది. పండుగకు పూలకు డిమాండ్ పెరుగుతుందని భావించి ఎంతో కష్టపడి పండించిన బంతిపూలను మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ రోజుల్లో రూ.150 నుంచి రూ.200 వరకు ధర పలికే బంతిపూల బుట్టకు పాడేరు మార్కెట్లో ప్రస్తుతం కేవలం రూ.20 నుంచి రూ.50 మాత్రమే లభిస్తోందని రైతులు వాపోతున్నారు. కొందరు దళారులు బుట్టను రూ.20 నుంచి రూ.30కే కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో పూల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు, పండించిన పూలను అమ్ముకునేందుకు మార్కెట్‌కు తీసుకురావడానికి రానుపోను రవాణా ఖర్చులే సుమారు రూ.100 అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. బంతిపూల అమ్మకాల ద్వారా వచ్చే మొత్తం రవాణా ఖర్చులకే సరిపోకపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. పండుగ సమయంలోనైనా మంచి ఆదాయం వస్తుందన్న ఆశతో మార్కెట్‌కు వచ్చిన తమకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Selfie Accident: సెల్ఫీ సరదా.. మూడు నిండు ప్రాణాలు బలి.!
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బంతిపూల రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆదివాసీ రైతులు కోరుతున్నారు. మార్కెట్లో ధరల పతనంతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, మార్కెట్ మాయజాలం మాత్రం మారడం లేదు.. పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేకపోగా.. వినియోగదారులకు కూడా పూల ధర అందుబాటులో ఉండడం లేదు.. ఏమైనా.. మధ్య దళారులు లబ్ది పొందుతున్నారు..
తాజావార్తలు
-
Yamaha Festive Offers 2026: Fascino 125 నుంచి R15 వరకు.. యమహా బైక్స్‌పై ప్రత్యేక ఆఫర్లు!
-
Canadian Military: కెనడా మిలిటరీ శిక్షణలో తీవ్ర విషాదం.. నలుగురు సైనికులు మృతి, 39 మందికి గాయాలు
-
Marigold Farmers: దసరా వేళ బంతిపూలకు ధరలేవీ? రైతులకు తీవ్ర నిరాశ!
-
Vishwak Sen: తాజుద్దీన్‌కు క్షమాపణలు.. అందుకే ‘కల్ట్’ సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తున్నా!
-
Team India: టీమిండియా జట్టులో భారీ మార్పులు.. టీం నుంచి ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..
ట్రెండింగ్
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!