Site icon NTV Telugu

Heavy Floods: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి-శబరి నదులు

Floods

Floods

Heavy Floods: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు గ్రామానికి వరద తాకిడి ఎక్కువైంది, చింతూరు వద్ద శభరి నది ప్రమాదకరస్థాయిలో 45 అడుగులతో ఉరకలు వేస్తుండగా, కూనవరం వద్ద శబరి 38 అడుగులకు పెరిగింది. చింతూరు మెయిన్ సెంటర్‌లోకి వరద నీటి ప్రవాహం చేరడంతో ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.

Read Also: Hanuman Chalisa: హనుమాన్ చాలీసా వింటే రుణ బాధలు తొలగి అఖండ సంపదలు

అల్లూరి జిల్లా చింతూరు కి శబరి నదికి వరద తాకిడి పెరిగింది ప్రమాదకరస్థాయిలో 45 అడుగుల వద్దకు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా సీలేరు, డొంకరాయి జలాశయాల్లో వరద నీరు చేరడంతో అధికారుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీనితో ఒక్కసారి చింతూరుకు వరద నీరు చేరింది. ఈ వరద ప్రవాహానికి రాత్రికి రాత్రే వేగంగా పెరిగి ఇళ్ల వద్దకు నీరు చేరింది.. ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉండటంతో చింతూరుకు వరద ముప్పు తప్పేలా లేదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చింతూరు మండల ప్రజలు.. మరోవైపు కూనవరం శబరి – గోదావరి సంగమం వద్ద గోదావరి అంతకంతకూ పెరుగుతోంది. ఇటు శబరి, అటు గోదావరి నదుల్లో వరద వేగంగా పెరుగుతుండటంతో కూనవరం, వీఆర్ పురం మండలాల ప్రజలు కూడా ఇళ్లు ఖాళీ చేసి పనిలో పడ్డారు.. వీఆర్ పురం మండలంలోని పలు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు.

Exit mobile version