Andhra Pradesh: ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని పట్టుబట్టింది.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఉద్యోగం సంపాదించి.. తన భవిష్యత్‌ను తీర్చుదిద్దుకోవడంతో పాటు.. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాలని కలలు కనింది.. దాని కోసం ఎంతో కష్టపడి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో అర్హత సాధించింది.. అన్నీ అనుకూలిస్తే.. త్వరలోనే టీచర్‌గా పాఠాలు చెప్పాల్సిన సమయంలో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.. అనారోగ్య సమస్యలతో కన్నుమూసింది ఓ యువతి..
Read Also: Box office results : అనుకున్నదే జరిగింది.. కూలీ, వార్ 2 ని వెనక్కి నెట్టిన రీజనల్ సినిమా
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి ఏజెన్సీలో గిరిజన విద్యార్థులకు మంచి విద్యను అందించి గిరిజన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుదాం అనుకున్న ఓ యువతి ఆశ ఆవిరి అయింది.. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కేంద్రంలో ఉన్న గాంధీనగర్ కు చెందిన ఎం.నాగజ్యోతి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహంచిన మెగా డీఎస్సీలో మంచి మార్కులు సాధించింది.. 74.40 మార్కులు రాబట్టింది.. మంచి మార్కులతో టీచర్ ఉద్యోగానికి అర్హురాలు అయినప్పటికీ.. క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె.. విశాఖలోని ఓ ఆసుపత్రిలో మృతి చెందింది… దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి… కొద్ది రోజుల క్రితం ఆనారోగ్యంతో తండ్రి మృతి చెందగా.. టీచర్ ఉద్యోగంతో… తన కుటుంబానికి అండగా నిలుద్దాం అనుకున్న నాగజ్యోతి మృతి.. వారిని మరింత కుంగుబాటుకు గురిచేసింది.. అయితే, కొన్ని రోజులుగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నాగజ్యోతి.. డీఎస్పీలో అర్హత సాధించింది.. తీరా, ఫిజికల్‌గా సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాల్సిన సమయంలో మృతిచెందింది..
