Site icon NTV Telugu

CM Chandrababu: పేదలను నాశనం చేయడానికే వైసీపీ పుట్టింది..

Babu

Babu

CM Chandrababu: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరు జిల్లాలోని వంజంగిలోని వనదేవత మోదకొండమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఇక, సమీపంలోని కాఫీ ప్లాంటేషన్లోని తోటలను పరిశీలించారు. కాఫీ ప్లాంటేషన్ పెంపకందారులతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ తోటల పెంపకంలో ఇబ్బందులేమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. అలాగే, వివిధ గిరిజన ఉత్పత్తులు, కాఫీ సాగు, మార్కెటింగ్, టూరిజం, హోం స్టే, హోం హట్స్ వంటి అంశాలకు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందాలను చేసుకున్నారు. టూరిజం శాఖ, జీసీసీ, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డులతో వివిధ కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి.

Read Also: PM Modi: రేపు బెంగళూరులో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

ఇక, సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది.. పేదలను నాశనం చేయడానికే వైసీపీ పుట్టింది అని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతం కానీ.. గత ప్రభుత్వ హయాంలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. అయితే, స్థానిక గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చేలా జీవో-3 తెచ్చాను.. జీవో-3 అమలు కాకుండా కాంగ్రెస్, వైసీపీ పార్టీలు ఆపాయని చెప్పుకొచ్చారు. సంపదనున సృష్టించి పేదలకు పంచాలన్నదే నా లక్ష్యం.. సూపర్ సిక్స్ ను.. సూపర్ హిట్ చేశారు.. చెప్పినట్లు పెన్షన్లు పెంచి ఇస్తున్నాం.. అలాగే, ఎన్ని కష్టాలు వచ్చిన ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం.. గిరిజనులకు రూఫ్ టాప్ సోలర్ అందిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Exit mobile version