NTV Telugu Site icon

Alla Ramakrishna Reddy: పేదల ఇళ్ల నిర్మాణాల్ని టీడీపీ అడ్డుకుంటోంది.. ఎమ్మెల్యే ఆర్కే ఫైర్

Alla Ramakrishna Reddy

Alla Ramakrishna Reddy

Alla Ramakrishna Reddy Fires On TDP Over Amaravati Land Distribution: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధాని ప్రాంతంలో పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంటోందని, న్యాయస్థానాల్ని ఆశ్రయించిందని మండిపడ్డారు. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడనే కక్షతోనే.. పేదల ఇళ్ల నిర్మాణాలను టీడీపీ అడ్డుకుంటోందని ఫైర్ అయ్యారు. అయితే.. వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా, ముఖ్యమంత్రి జగన్ మాత్రం పేదల ఇళ్ల నిర్మాణాలకి శ్రీకారం చుడుతున్నారని అన్నారు.

Korea Open: హ్యాట్రిక్తో అదరగొట్టిన సాత్విక్‌, చిరాగ్ శెట్టి.. కొరియా ఓపెన్ టైటిల్ కైవసం

డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాలని పూర్తి చేయాలని జగన్ కోరారని, సంక్రాంతి నాటికి పేదల సొంతిళ్ల గృహప్రవేశాలు జరగాలని ఆయన భావిస్తున్నారని పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తే.. తండ్రి బాటలోనే వైఎస్ జగన్ 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి, వాటి నిర్మాణాలకి శ్రీకారం చుట్టారని అన్నారు. ఇళ్లు లేని వాళ్లు ఎవరూ ఉండకూడదని జగన్‌ సంకల్పించారని.. అందుకే రాష్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 53 వేల మంది నిరుపేదలకి సీఎఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణాలకి ఈ నెల 24న సీఎం జగన్ భూమి పూజ చేయబోతున్నారని వెల్లడించారు.

Sunny Leone: ఆ వీడియోస్ వలనే నా తల్లి దానికి బానిసగా మారింది

అంతకుముందు కూడా చంద్రబాబుపై ఎమ్మెల్యే ఆర్కే ధ్వజమెత్తారు. అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్లు ఇవ్వడాన్ని చంద్రబాబు రియల్ ఎస్టేట్ వర్గం గతంలోనూ వ్యతిరేకించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని, పేదలకు ఇళ్లు ఇవ్వటాన్ని కూడా న్యాయస్థానాలు ఆమోదిస్తాయనే నమ్మకం ఉందని తెలిపారు. తన ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఎందుకు పేదలకు ఇళ్లు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు.