Site icon NTV Telugu

Minister Ambati Rambabu: అన్ని ప్రాజెక్టుల గేట్లు రిపేర్‌లోనే.. ఇది వాస్తవం..

Ambati Rambabu

Ambati Rambabu

రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో గేట్లు రిపేర్లలో ఉన్న మాట వాస్తవం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు… అయితే, ఇవన్నీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏమి జరగలేదన్నారు.. సీఎం జగన్ పై అనవసర ఆరోపణలు చేసి లబ్ధిపొందాలని చూస్తే ఉపయోగం లేదని.. అన్నీ డ్యామ్‌ల సేఫ్టీ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు… ఇక, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కూరుకుపోవడం వల్ల 700 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్లాయి.. నీటి ప్రవాహం అధికం ఉండటం వల్ల రెండు రోజుల నుండి స్టాప్ లాక్ ఏర్పాటు చేయలేక పోయామని తెలిపారు.. కొన్ని గేట్లు బాగాలేదని ఇప్పటికే నివేదిక ఇవ్వటంతో రిపేర్ల కోసం అనుమతి ఇచ్చాం.. గేట్లు బాగుచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.. అవసరమైతే నాగార్జున సాగర్ నీటితో రిజర్వాయర్ నింపుతాని వెల్లడించారు అంబటి..

Read Also: Bandi Sanjay: నిఖార్సైన తెలంగాణవాది.. అయితే! సీఎం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి..

కొందరు కావాలని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు.. ఐదారేళ్ళ నుండి తుప్పు పట్టడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు మంత్రి అంబటి… రెండు గేట్లు బాగలేకపోవటంతో ఇప్పటికే స్టాప్ లాక్స్ ఏర్పాటు చేశాం.. గత ప్రభుత్వం డ్యాం సేఫ్టీ కోసం రూపాయి ఖర్చు చేయలేదని విమర్శించారు.. రాజకీయంగా ఈ విషయాన్ని వాడుకోవాలని చూడటం సరైనది కాదని హితవుపలికిన ఆయన.. చంద్రబాబు విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏ పరిశ్రమ ఏపీకి రాకూడదని చంద్రబాబు పూజలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. ఏపీకి బల్క్ డ్రగ్ పార్క్ వల్ల పర్యావరణ కాలుష్యము ఏర్పడుతుంది.. ప్రాజెక్ట్ వద్దని యనమల రామకృష్ణుడు లేఖ రాశారని మండిపడ్డారు. ఆరు కోట్ల రూపాయలు డబ్బు టీడీపీ డ్యాం కోసం ఖర్చు పెట్టలేక పోయింది.. గత ప్రభుత్వం డ్యాంలను అశ్రద్ద చేయటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు గుండ్లకమ్మలో ఉన్న 3.4 టీయంసీ నీటిలో 2 టీయంసీలు సముద్రంలో విడుదల చేయక తప్పదు.. పులిచింతలలో కూరుకుపోయిన గేట్లు రిపేర్ చేస్తున్నాం.. రాష్ట్రంలో అన్నీ ప్రాజెక్టులలో గేట్లు రిపేర్లలో ఉన్న మాట వాస్తవమే అన్నారు మంత్రి అంబటి రాంబాబు.

Exit mobile version