Ajay Kallam: గడువులోగా సాదా బైనామా పత్రాల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక గడువును నేపథ్యంలో సాదా బైనామా పత్రాల క్రమబద్దీకరణకు అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని.. చేసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం సూచించారు. భూమిని కొనుగోలు చేసినప్పటికీ పట్టాలు పొందనివారు లక్షల్లో ఉన్నారని వారందరూ తమ హక్కు పత్రాలు పొందగలిగేలా ప్రభుత్వం నూతన అవకాశం ఇచ్చిందన్నారు.. సాదా బైనామా పత్రాల క్రమబద్దీకరణపై మంగళగిరి భూపరిపాలనా శాఖ ఛీఫ్ కమీషనర్ కార్యాలయం వేదికగా అన్ని జిల్లాల నుండి ఎంపికచేసిన డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్, ఇతర రెవెన్యూ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలోని భూమి హక్కుల కేంద్రం, భూ సర్వే శాఖ సంయిక్త నిర్వహణలో ఈ సదస్సు జరగగా, పూర్తి సమాచారంతో నూతనంగా రూపొందించిన సాదా బైనామాల క్రమబద్దీకరణ పుస్తకాన్ని అజయ్ కల్లం, భూమి రికార్డులు, సర్వే సెటిల్ మెంట్ కమీషనర్ సిద్దార్ధ జైన్ ఆవిష్కరించారు.
Read Also: CM YS Jagan: రేపు విశాఖ, గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
Also Read
ఇక, ఈ సందర్భంగా అజయ్ కల్లం మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుపేద రైతుల కోసం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిన బాధ్యత అధికారులదే అని స్పష్టం చేశారు.. ఆర్ఓఆర్ చట్టం నిబంధనలకు లోబడి క్రమబద్దీకరణ చేయాలని సూచించారు. భూమి రికార్డులు, సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ సిద్దార్ధ జైన్ మాట్లాడుతూ సాదాబైనామాల క్రమబద్దీకరణ గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుందన్నారు. 2021 అక్టోబరు మాసాంతంలోపు జరిగిన చిన్న సన్నకారు రైతుల కొనుగోళ్లకు మాత్రమే క్రమబద్దీకరణ చేయగలుగుతామన్నారు. కొనుగోలు చట్టాలకు భిన్నంగా, భూ హక్కుల వివాదం ఉంటే సాదాబైనామాల క్రమబద్దీకరణ చేయటం సాధ్యం కాదని పేర్కొన్నారు.. రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమన్ని పూర్తిస్థాయి లో సద్వినియోగం చేసుకుని జిల్లా, డివిజన్, మండల స్థాయిలో తిరిగి శిక్షణ కార్యక్రమల్ని నిర్వహించి.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, అర్ఓఅర్ చట్టం, నియమ భరితంగా క్రమబద్దీకరణ విధానం తదితర అంశాలను భూ చట్టాల నిపుణులు, న్యాయవాది సునీల్ తెలియజేశారు.
తాజావార్తలు
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..