Site icon NTV Telugu

Adivasi Divas: వైసీపీ కార్యాలయంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం

Ysrcp Central Office (1)

Ysrcp Central Office (1)

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు హనుమంత నాయక్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతిని కాపాడుకోవడంలో పాటు విద్య వైద్యం అవసరం అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే పాడేరులో వైద్య కళాశాల మంజూరు చేశారు.

విద్య విషయంలో నాడు నేడు కింద ఈ ప్రభుత్వం అభివృద్ది చేస్తోంది. గిరిజనుల్లో నాయకత్వాన్ని పెంచి గుర్తింపు ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలు, ఆశయాలు ఆదివాసీల కోసమే అన్నారు. వారికోసం ప్రత్యేకంగా జిల్లాలను కూడా ఏర్పాటు చేశారు. అధికారంలోకి రాకముందు కూడా గిరిజనుల కోసం పాటు పడిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. భూయాజమన్య హక్కులను మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గిరిజనులకు అందించారు.

ఈ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల ప్రభుత్వం. ప్రతి సంక్షేమ ఫలాలను గిరిజనులకు అందిస్తున్నారు. పోడు భూముల హక్కులను కల్పిస్తూ అండగా నిలిచారు. వైఎస్సార్సీపీ గిరిజన విభాగం అధ్యక్షుడు హనుమంతు నాయక్ గిరిజనుల కోసం జగన్ చేస్తున్న కృషిని ప్రస్తావించారు. గిరిజన హక్కులను కాపాడే దిశగా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం అన్నారు. చంద్రబాబు గిరిజనుల హక్కులను అణచివేసిన విషయం అందరూ గుర్తుంచుకోవాలి. ఎస్టీ కమిషన్, గిరిజన సలహా మండలి ఏర్పాటు వైఎస్ జగన్ చేశారు. గిరిజనులను డిప్యూటీ సీఎం గా చేశారు. అర్వో ఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చి గిరిజనులకు మేలుచేసిన వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు.

Bihar Politics: బీజేపీతో జేడీయూ తెగదెంపులు.. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సీఎం నితీష్ కుమార్

Exit mobile version