Site icon NTV Telugu

Eluru: ఏలూరులో బాలుడి ప్రాణాలు తీసిన ఐఫోన్ మోజు..!

Suside

Suside

Eluru: ఏలూరు ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన బండా రామకృష్ణ (17) పదో తరగతి వరకూ చదివి ప్రస్తుతం మోటారు సైకిల్‌ మెకానిక్‌ పనులు నేర్చుకుంటున్నాడు. ఐఫోన్ కొని ఇవ్వాలని ఇటీవల కుటుంబ సభ్యులను అడిగిన సదరు బాలుడు.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని తర్వాత కొంటామని తల్లిదండ్రులు చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు.. ఐ ఫోన్ కొనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించి.. ఈనెల 13వ తేదీన ఎలుకల మందు పేస్టును తినేశాడు. ఇక, విషయం తెలిసిన తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ఆసుపత్రిలో బంధువులు చేర్పించారు.

Read Also: Dasara: తగ్గని దసరా దూకుడు.. IIFAలోనూ నాని సినిమాదే హవా!

అయితే, చికిత్స పొందుతూ వారం రోజుల అనంతరం నిన్న ( బుధవారం ) సాయంత్రం రామకృష్ణ మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. మృతుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, కేవలం ఐఫోన్ మోజులో పడి ఇలాంటి దారుణాలకు పాల్పడొద్దు అంటూ స్థానిక పోలీసులు పేర్కొంటున్నారు.

Exit mobile version