NTV Telugu Site icon

Tirupati: టీటీడీ హెచ్చరించిన మారని తీరు.. పవిత్ర స్థలంలో ‘కిస్సిక్‌’ సాంగ్‌కు డ్యాన్స్‌

Tirupati

Tirupati

Tirupati: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్‌ చేయడం.. లాంటివి నిషేధించినా.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.. కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట బూతు పాటలకు రీల్స్‌ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు.. తాజాగా, అలిపిరి టోల్ గేట్ వద్ద పుష్ప-2 మూవీలోని ‘కిస్సిక్’ సాంగ్‌కు డాన్స్ చేసింది ఓ యువతి.. అలిపిరి టోలేట్ ముందు డాన్స్ చేసిన ఆ వీడియోను యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేయడంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. ఆ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.. ఇలాంటి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్‌చేస్తున్నారు.. అయితే, గతంలోను కోండపై సినీ నటి నయనతార ఫొటో షూట్, దర్శనం క్యూ లైన్‌లో చెన్నై యువకులు రీల్స్‌ చేయడం.. మొన్న అలిపిరి మెట్ల వద్ద పులి అంటూ బిగ్ బాస్ ఫేమ్‌ యువతి రీల్‌ చేయడం.. ఇలా.. వరుస ఘటనలు జరుగుతుండడంపై భక్తులు మండిపడుతున్నారు..

Show comments