Site icon NTV Telugu

Tiruvuru: తిరువూరులో ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం..

Tiruvuru

Tiruvuru

Tiruvuru: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విసన్నపేట మండలం నూతిపాడు గ్రామానికి చెందిన మైనర్ (15) విద్యార్థిని.. గత రెండు నెలలుగా ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన తోట చందు అనే యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు. అయితే, చందుకి సహకారం అందించిన అదే గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లు.. జ్వరంతో బాధపడుతున్న మైనర్ బాలిక ఇంటి వద్ద నుంచి కళాశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన ఆర్టీసీ బస్సులో వస్తున్న బాలికను బోసుబొమ్మ సెంటర్లో యువకుడు దించాడు. తన మిత్రులతో కలిసి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకువెళ్లి కూరగాయల మార్కెట్ వీధిలో ఓ భవనంలో బలవంతంగా అత్యాచారం చేశాడు.

Read Also: Crime News: డెహ్రాడూన్‌లో దారుణం.. బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం!

అయితే, అదే రోజు సాయంత్రం వరకు బాలికను బైక్ పై వేరే ప్రాంతానికి తీసుకెళ్లి.. తిరిగి సాయంత్రం ఇంటి దగ్గరలో దింపేసి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు. తల్లికి బాలిక చెప్పడంతో పంచాయితీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళింది.. అక్కడ న్యాయం జరగకపోవడంతో తిరువూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసిన తిరువూరు పోలీసులు.. నిందితుడికి కోసం గాలిస్తున్నారు.

Exit mobile version