Software Engineer Suicide: ఇటీవల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పలువురు కుటుంబ సమస్యలు, ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సాధారణంగా ఇప్పటికీ చాలా మందిలో సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే ఓ మోజు. లక్షల్లో ప్యాకేజీలు ఉంటాయని, కార్లు, అపార్ట్‌మెంట్లు ఇలా అన్ని భోగాలు అనుభవిస్తారని అనుకుంటారు. అమ్మాయిల తల్లిదండ్రులకు కూడా సాఫ్ట్‌వేర్ అల్లుడు అయితేనే ఓకే. వారికి మాత్రమే తమ బిడ్డను ఇచ్చి పెళ్లి చేస్తామని చెబుతుంటారు. కానీ డార్క్ రియాలిటీ మాత్రం వేరేలా ఉంది. చాలా మంది పని ఒత్తిడితో, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె విమర్శలు..
ఇదిలా ఉంటే, తాజాగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య సంచలనంగా మారింది. పెళ్లయి నెల రోజులు గడవక ముందే సూసైడ్ చేసుకోవడంతో కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌గూడలో ఘటన జరిగింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న కర్నూలుకు చెందిన యువకుడు అరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడికి పెళ్లయి 21 రోజులు మాత్రమే అవుతోంది. ఇలా పెళ్లయిన కొన్ని రోజులకే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం గురించి ఆరా తీస్తున్నారు.