NTV Telugu Site icon

Chittoor: ఏడాది కష్టం.. క్షణకాలంలో నేలమట్టం.. గ్రామ ప్రజలను హడలెత్తిస్తున్న ఏనుగులు..

Untitled 5

Untitled 5

Chittoor: ఓ మహిళా ప్రకృతి వ్యవసాయం చేసింది. ఏడాది పాటు రాత్రి పగలు నిద్రాహారాలు మాని పెట్టిన పైరును కంటికి రెప్పలా కాపాడుకుంది. అయితే ఆమె కష్టానికి ప్రతిఫలం లేకుండా పోయింది. ఆరుగాలం కష్టపడి పెట్టుకున్న పంటను ఏనుగుల గుంపు నాశనం చేసింది. ఈ ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా లోని బైరెడ్డిపల్లి మండలం లోని కడతట్లపల్లె గ్రామం లోని పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ క్రమంలో కోతల దశలో ఉన్న మూడు ఎకరాల అరటి తోట నేలమట్టం అయ్యింది. ఈ తోటను ఆ గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే మహిళా రైతు సంవత్సరం పాటు ప్రకృతి వయవసాయ పద్దతులను ఉపయోగించి సాగు చేసింది.

Read also:War 2: ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన యష్ రాజ్ ఫిల్మ్స్…

కాగా ఆ తోట బాగా పండి కోతకు వచ్చింది. ఇక కాయలు దింపాలి అనుకుంటున్న సమయంలో ఏనుగుల గుంపు తోట పైన దాడి చేసి అరటి చెట్లను నాశనం చేసాయి. ఈ ఘటనతో ఆ మహిళకు రూ/ 3 లక్షలు నష్టం వచ్చింది. కష్టపడి పెట్టిన పైరు తీరా చేతికి వచ్చే సమయానికి ఇలా జరగడంతో వరలక్ష్మి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధిత రైతు కుటుంబం కోరుకుంటుంది. కాగా ఏనుగుల గుంపు సంచారంతో అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామ ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.