NTV Telugu Site icon

Andhra Pradesh Crime: రూ.500 కోసం ప్రియుడి ప్రాణాలు తీసిన ప్రియురాలు..!

Chittoor

Chittoor

500 రూపాయల కోసం ప్రియుడిని ప్రియురాలే హత్య చేసిన ఘటన చిత్తూరులో కలకలం సృష్టించింది… పుంగనూరుకు చెందిన ఈశ్వరయ్య, యాదమరికి చెందిన లలిత మధ్య అక్రమ సంబంధం నడుస్తోంది.. అయితే, ఇద్దరు కలసి చిత్తూరులోని ఓ లాడ్జిలో దిగారు.. ఇద్దరి మధ్య డబ్బుల కోసం గొడవ జరిగినట్టు తెలుస్తుండగా… రూ.500 కోసం ప్రియుడు ఈశ్వరయ్యను హత్య చేసిన ప్రియురాలు లలిత.. రూ. 500కు తీసుకుని పరారైనట్టు చెబుతున్నారు.. ఇక లాడ్జిలో ఈశ్వరయ్య మృతదేహాన్ని చూసి షాక్‌ తిన్న నిర్వాహకులు.. పోలీసులకు సమాచారం అందించారు.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన చిత్తూరు వన్‌టౌన్‌ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. అయితే, రూ.500ల కోసమే.. ప్రియుడిని హత్య చేసింది..? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.

Read Also: Telangana Unity Vajrotsavam: ఇవాళ్టి నుంచి తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలు