Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News 8 Members Arrested In Tdp Leader Chandraiah Murder Case

టీడీపీ నేత హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అందుకే హత్య-ఎస్పీ

Published Date :January 14, 2022 , 2:33 pm
By Sudhakar Ravula
టీడీపీ నేత హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అందుకే హత్య-ఎస్పీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్య హత్య కేసు కలకలం సృష్టించింది.. అయితే, హత్య జరిగిన 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు పోలీసులు.. మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ప్రకటించారు.. ఈ హత్యకు ప్రధాన కారణం పాత తగాదాలు అని మా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు తెలిపారు.. మృతుడు తోట చంద్రయ్య మరియు ప్రధాన నిందితుడు చింతా శివ రామయ్య గుండ్లపల్లి గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారని.. మూడేళ్ల క్రితం మృతుడు, ముద్దాయి మధ్య వారి ప్రాంతంలో వేసే సిమెంట్ రోడ్డు విషయంలో గొడవలు జరిగాయని.. అప్పటి నుండే వారి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని.. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన గ్రామంలో తమ బంధువుల వేడుకకు హాజరైన తోట చంద్రయ్య… చింతా శివరామయ్యను చంపుతానని చెప్పాడని ప్రచారం జరిగినట్టు.. ఆ విషయం చింత శివరామయ్యకు బంధువుల ద్వారా తెలియడంతో.. అతను చంపడానికంటే ముందే నేనే చంద్రయ్యను చంపాలని శివరామయ్య, తన కుమారుడు మరియు ఆరుగురు అనుచరుల సహాయంతో నిన్న హత్య చేశారని వెల్లడించారు.

Read Also: బిగ్‌ బ్రేకింగ్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి జకోవిచ్‌ ఔట్

మొత్తంగా పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య చేశారని మా దర్యాప్తులో తేలిందన్నారు ఎస్పీ విశాల్‌ గున్నీ.. నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా దర్యాప్తు జరిపి నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.. పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు… వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విశాల్ గున్నీ. ఇక, నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి… 1. చింత శివ రామయ్య, 2. చింత యలమంద కోటయ్య, 3. సాని రఘు రామయ్య, 4. సాని రామకోటేశ్వరరావు , 5. చింతా శ్రీనివాసరావు, 6. తోట ఆంజనేయులు, 7. తోట శివ నారాయణ, 8. చింతా ఆదినారాయణ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Chandraiah
  • Chandraiah Murder case
  • police
  • tdp

తాజావార్తలు

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

  • Growth Risks: భారత ఆర్థిక వృద్ధికి పొంచి ఉన్న ముప్పు.. భారీగా తగ్గిన అంచనాలు..

  • Trump: ‘నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు’.. సౌదీ యువరాజుపై బాంబ్ పేల్చిన ట్రంప్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions