6 Members Died In Srikalahasthi Road Accident: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని అతి వేగంగా వస్తున్న ఓ కారు ఢీకొట్టడంతో.. ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. శ్రీకాళహస్తి సమీపంలోని మెట్టకండ్రిగ దగ్గర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో.. కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Naga Chaitanya : త్వరలోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్న నాగ చైతన్య..?
ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతులు విజయవాడకు చెందినట్టుగా గుర్తించారు. ఎదురుగా వస్తున్న లారీని హైస్పీడ్‌లో ఢీనకొనడంతో.. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. తమ యాత్రలో భాగంగా వీళ్లందరూ తొలుత తిరుపతికి వెళ్లి ఉంటారని, అక్కడి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తూ ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ నిదానంగా కారు నడిపి ఉంటే, ఇంత ఘోరం జరిగుండేది కాదని అభిప్రాయపడుతున్నారు. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Minister Malla Reddy: కేసీఆర్ ప్రధాని కావాలని ఆ అమ్మవారిని కోరుకున్నా..