NTV Telugu Site icon

Boy Missing in Forest: దారితప్పిన ఐదేళ్ల బాలుడు.. రాత్రంతా అడవిలోనే..

Boy Missing

Boy Missing

Boy Missing in Forest: ఓ ఐదేళ్ల బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉండడమే కష్టం.. పడుకున్న సమయంలోనూ తన పక్కన ఎవరైనా ఉండేలా చూసుకుని నిద్రకు ఉపక్రమిస్తుంటారు పిల్లలు.. అయితే, అడవిలో దారితప్పిపోయి.. రాత్రి మొత్తం ఆ ఫారెస్ట్‌లోనే గడపాల్సిన పరిస్థితి వస్తే.. అయ్య బాబోయ్‌.. పెద్దవాళ్లకు వణుకుపుడుతోంది.. ఇక, ఆ చిన్నోడి పరిస్థితి ఏంటి? అసలే అటవీ ప్రాంతం.. క్రూరమృగాలు, విషసర్పాలు, చిన్న, పెద్ద జంతువులు ఎన్నో ఉంటాయి.. కానీ, ఆ బాలుడు సురక్షితంగా ఇంటికి చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

Read Also: MLA Chinnaiah: మరో వివాదంలో ఎమ్మెల్యే చిన్నయ్య.. టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి

కడప జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పోరుమామిళ్ల మండల కలవకుంట్ల అటవీ ప్రాంతంలో తండ్రితో కలసి పశువులను మేపేందుకు ఆటవీప్రాంతానికి వెళ్లాడు ఐదేళ్ల బాలుడు సుమంత్.. అయితే, పశువులను మేపే క్రమంలో.. తన తండ్రి నుంచి దూరం అయ్యాడు.. అలా దారితప్పిపోయాడు.. ఇక, బాలుడి ఆచూకీ కోసం ఆందోళనకు గైరన కుటుంబసభ్యులు.. గ్రామస్తులు, అటవీ సిబ్బందితో కలిసి రాత్రంతా అడవీ గాలించినా ఉపయోగం లేకుండా పోయింది.. దీంతో, అంతా తిరుగుప్రయాణం అయ్యారు.. అయితే, ఈ ఉదయం సుమంత్ ఆచీకి లభ్యమైంది.. అటవీ ప్రాంతంలో సుమంత్‌ను గుర్తించిన అటవీశాఖ సిబ్బంది.. ఆ తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి.. క్షేమంగా బాలుడిని అప్పజెప్పారు.. రాత్రి మొత్తం అడవీలో ఒంటరిగా గడిపి ఉదయానికి సురక్షితంగా ఇంటికి చేరిన ఆ బాలుడి నిజంగా మంచి ధైర్యవంతుడనే చెప్పాలి.