NTV Telugu Site icon

Simhadri Appanna Pushkarini: సింహాద్రి అప్పన్న ఆలయంలో విషాదం.. పుష్కరిణిలో మృతదేహం..

Simhadri Appanna

Simhadri Appanna

Simhadri Appanna Pushkarini: ప్రముఖ పుణ్యక్షేత్రం.. సింహాద్రి అప్పన్న ఆలయ పరిసరాల్లో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది.. అప్పన్న వరాహ పుష్కరిణిలో తేలిన ఓ వ్యక్తి మృతదేహం తేలింది.. ప్రహ్లాదపురం పల్లినారాయనపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.. రెండు రోజుల క్రితం ఇంటినుండి వెళ్లిన కొలుసు అప్పలరాజు(42) అనే వ్యక్తి.. పుష్కరిణికి చేపల వేటకు వెళ్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు.. అయితే, చేపలు పడుతూ.. పుష్కరిణిలో పడి మృతిచెందాడా? లేక ఎవరైనా హత్య చేసి అందులో పడవేశారా? అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.. ఇక, మృతుడి ముఖంపై గాయాలు ఉండటంతో హత్య చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గోపాలపట్నం పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం కొలుసు అప్పలరాజు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.. అప్పలరాజు మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. హత్యా? ఆత్మహత్యా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Read Also: Bangalore: కదులుతున్న కారులో యువతిపై సామూహిక అత్యాచారం

Show comments