ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పర్యాటకులకు గుడ్‌న్యూస్ చెబుతూ.. శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తారు అధికారులు.. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో రూపంలో ఇంకా భారీగా వరద వస్తుండడంతో.. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు గరిష్టస్థాయికి చేరుకోవడంతో.. 7వ గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు.. ఈ కార్యక్రమంలో ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు… దీంతో.. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల కోలాహలం మొదలైంది.. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తితే.. ఆ ప్రాజెక్టు పరిసరల ప్రాంతాల్లో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం అవుతుంది.. డ్యామ్ నుంచి విడుదలైన వాటర్.. ఒక్కసారిగా మళ్లీ పైకి ఎగిసి వర్షంలా పడుతుంటే.. ఆ వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు పర్యాటకులు.. ఓవైపు మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులు.. మరోవైపు.. పర్యాటకులతో ఆ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోతోంది.. ఇక, ఆదివారానికి ఒక రూపు ముందు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో.. పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. గతంలో పర్యాటకుల సందడితో.. అటు శ్రీశైలం వైపు.. ఇటు హైదరాబాద్ వైపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి..
Read Also: Warning to Singer Sravana Bhargavi: శ్రావణ భార్గవికి వార్నింగ్.. ఇక్కడ అడుగుపెట్టనివ్వం..!
ఇక, ప్రస్తుతం ఇన్‌ఫ్లో రూపంలో 1,11,970 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్‌లోకి వచ్చి చేరుతుండగా, 6, 7, 8 నంబర్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. ఒక్కో గేట్ ద్వారా 26 క్యూసెక్కుల చొప్పున శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ వైపు పరుగులు పెడుతోంది కృష్ణమ్మ.. కాగా, తుంగభద్రతో పాటు కృష్ణానది నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో.. శ్రీశైలంలో వేగంగా నీటి మట్టం పెరిగింది.. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిండడంతో.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు.. కుడి, ఎడమ గట్టుకు ఉన్న విద్యుత్ కేంద్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి కోసం మరో 57 క్యూసెక్కుల నీటిని వాడుతున్నాయి.. దీంతో.. దాదాపు 1.30 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపు వెళ్తుంది.. వారం-10 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే.. నాగార్జునసాగర్ పూర్తిస్థాయిలో నిండుతుందని అధికారులు చెబుతున్నారు.