Site icon NTV Telugu

AP- TS 10th Exams: తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం

Ap Ts 10th Class Exams

Ap Ts 10th Class Exams

AP- TS 10th Exams: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 10 వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులు అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఐదు నిమిషాల అదనపు గ్రేస్ టైమ్ ఇచ్చారు. ఈ ఐదు నిమిషాల గ్రేడ్ టైం ఏపీ విద్యార్థులకు వర్తించదు కేవలం.. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఐదు నిమిషాల గ్రేట్ టైమ్ ఇస్తున్నట్లు తెలిసింది. అంటే ఉదయం 9.35 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. విద్యార్థులు వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఉదయం 8.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. విద్యార్థులు కాగితాలు, ఇతర పత్రాలు తమ వెంట తీసుకెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. అవకతవకలకు పాల్పడితే డిబార్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. SCSC పరీక్షల అభ్యర్థులకు RTC అన్ని తెలుగు రాష్ట్రాలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. హాల్ టికెట్ చూపిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే అవకాశం కల్పించారు. సెలవు రోజుల్లో కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. కాంబినేషన్ టికెట్ తో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చని వెల్లడించారు.

Read also: BJP: కొత్త తరాన్ని సిద్ధం చేస్తోన్న బీజేపీ.. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్లాన్‌ ఇదేనా?

తెలంగాణలో 5,08,385 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. తెలంగాణలో విద్యార్థులకు ఐదు నిమిషాల (ఉదయం 9.35 గంటల వరకు) గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. ఈ పరీక్షలు ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 2676 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2676 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 30 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

Read also: Russia Ukraine War : అధ్యక్ష ఎన్నికల చివరి రోజున రష్యాపై 35 డ్రోన్లతో ఉక్రెయిన్ భారీ దాడి

ఏపీలో 7,25,620 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. ఏపీలో ఈ నెల 30తో పరీక్షలు ముగియనున్నాయి. వారిలో 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 1,02,528 మంది మళ్లీ నమోదు చేసుకున్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 3,17,939 మంది, బాలికలు 3,05,153 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. APలో విద్యార్థులకు ఎటువంటి గ్రేస్ పీరియడ్ ఇవ్వలేదు.

Read also: Naa Saamiranga : టీవీలోకి వచ్చేస్తున్న నాగార్జున మూవీ.. ఎప్పుడంటే?

నిబంధనలు..షరతులు ..!

* విద్యార్థులు తమ వెంట హాల్ టిక్కెట్లు తీసుకెళ్లాలి. లేకుంటే పరీక్షకు అనుమతించరు.
* లాటరీ విధానంలో ఇన్విజిలేటర్లకు గదులు కేటాయిస్తారు.
* బాలికలను మహిళా ఉపాధ్యాయులు తనిఖీ చేస్తారు.
* విద్యార్థులకు ఇచ్చే మ్యాప్‌లు, గ్రాఫ్‌లపై ఇన్విజిలేటర్ల సంతకం ఉండాలి.
* పరీక్ష రాసిన తర్వాత చివరి పేజీలో ది ఎండ్ రాసే విద్యార్థులతో ఇన్విజిలేటర్లు సంతకం చేయాలి.
* ఇన్విజిలేటర్లు స్వయంగా సీటింగ్ ఏర్పాట్లను మార్చుకోకూడదు.
* అదే పాఠశాల విద్యార్థులు తరచూ ఆలస్యంగా వస్తే CSDOకి ఫిర్యాదు చేయాలి.
* ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసినప్పటికీ సీఎస్‌డీఓలకు సమాచారం అందించాలి.

ఏప్రిల్ 3 నుంచి మూల్యాంకనం..
10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్‌ 3 నుంచి 11వ తేదీ వరకు జరుగుతుందని.. మొత్తం 9 రోజుల పాటు స్పాట్‌ వాల్యుయేషన్‌ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 19 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్చి 23న వాల్యుయేషన్‌ సిబ్బందికి ఓరియంటేషన్‌ నిర్వహించనున్నామని.. 11 పేపర్లను 6 పేపర్లకు కుదించినందున జవాబు పత్రాల సంఖ్యను కుదించనున్నట్లు తెలిపారు. దీంతో త్వరితగతిన మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
North Korea: ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం!

Exit mobile version