PM Modi: నేడు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఇవాళ జగిత్యాలల జిల్లాలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి జగిత్యాలకు ప్రధానమంత్రి మోడీ బయలుదేరానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయసాంకల్ప సభ కు బీజేపీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఉన్న హెలిపాడ్ వద్దకు మోడీ చేరుకోన్నారు. అయితే.. హేలిపాడ్ వద్ద 20 మంది నాయకులకు మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు. ఉదయం 10:45ని లకు జిల్లా కేంద్రంలోని గీతవిద్యలాయం ఆవరణలో జరగనున్న విజయసాంకల్ప సభ ప్రాంగనానికి రోడ్ మార్గాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరకొనున్నారు. సభ వేదికపై కరీంనగర్ నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉండనున్నారు. ఇక సభ వేదిక పై 36 మంది నాయకులకు మాత్రమే అనుమతించారు. సభ ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పటిష్ట బద్ధత ఏర్పాటు చేసిన జిల్లా పోలీసు యంత్రాంగం.
Read also: Astrology: మార్చి 18, సోమవారం దినఫలాలు
ప్రధాని పర్యటన బహిరంగ భద్రత కోసం మూడు జిల్లాల నుంచి 1600 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి వారికి బందోబస్తును సెక్టార్లుగా విభజించేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. గా, ఈ సభకు కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి లక్ష మందిని తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. జగిత్యాల నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. కానీ, కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలకు కాస్త దగ్గరలో ఉంది కాబట్టి ప్రజలు సభకు భారీగా వచ్చే ఛాన్స్ ఉండటం వలన పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జగిత్యాల పర్యటన నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ధర్మపురి నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లిస్తారు. నిన్న అంటే ఆదివారం ఆయన ఏపీలో మాట్లాడిన సంగతి తెలిసిందే. చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కూటమిలో అవగాహన కల్పించేందుకు వీరంతా కలిసి సమావేశం నిర్వహించారు. కానీ, మోడీ ప్రసంగం చప్పగా సాగిందని సొంత కూటమి క్యాడర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
North Korea: ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం!