NTV Telugu Site icon

వైసీపీ కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు

తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు వైసీపీ నేతలు నిర్వహించారు. ఈ వేడకలకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు హజరయ్యారు. జగన్ జీవితం, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను సజ్జల ప్రారంభించారు. రక్తదానం, వస్త్రాల పంపిణీ వంటి పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పార్టీ శ్రేణులు చేపట్టారు. అన్ని మతాల మత పెద్దలు ప్రార్ధనలు చేశారు.
అంతేకాకుండా సీఎం వైఎస్ జగన్ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం పుట్టినరోజు వేడుకలను వైసీపీ నేతలు నిర్వహిస్తున్నారు.