Site icon NTV Telugu

BJP Plan : ఇక తెలుగు రాష్ట్రాలు సైతం కైవసం..?

దేశంలో ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ తన సత్తా చాటింది. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ విముఖత ఉన్నట్లు, యోగి సర్కార్ పై అక్కడి ప్రజలకు నమ్మకం పోయినట్లు ప్రత్యర్థి పార్టీలు ఎన్ని సంకేతాలు ప్రజల్లోకి పంపినా మళ్లీ అక్కడ అధికారంలో బీజేపీనే వచ్చింది. 5 రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు కమలనాథులు చేసిన ప్రచారం మామూలుగా లేదు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి తమ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించుకుందామనుకున్న కాంగ్రెస్ కు నిరాశే మిగిలింది. 4 రాష్ట్రాల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్‌ ఆఖరికి గత ఎన్నికల్లో అధికారంలోకి పంజాబ్ ను సైతం ఈ ఎన్నికల్లో చేజార్చుకుంది. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో కమలనాథులు విజయ దుందుభి మ్రోగిస్తూ.. ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు.

అయితే 4 రాష్ట్రాల్లో బీజేపీ నాథులు విజయం సాధించడంతో మిగితా రాష్ట్రాల బీజేపీ నేతల్లో సైతం ఉత్సాహం పరుగులు పెడుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలపై ఎప్పటి నుంచో కన్ను ఉన్న బీజేపీకి ఈ ఎన్నికల ఫలితాలు మరింత బలం చేకూర్చాయి. దీంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇటీవల జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఉపయోగించిన ‘డబుల్ ఇంజన్’ ఫార్మూలాను తెలుగు రాష్ట్రాల్లో కూడా వాడేందుకు ఇక్కడి నేతలు సిద్ధమయ్యారు. తెలంగాణలో బీజేపీ కొంచెం గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఏపీ మాత్రం బీజేపీ కదలికలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

అంతేకాకుండా తెలంగాణ బీజేపీ చీఫ్‌ గా బండి సంజయ్‌ పగ్గాలు చేత పట్టిన నాటి నుంచి తెలంగాణలో బీజేపీ పుంజుకుందనే చెప్పుకోవాలి. అందుకు నిదర్శనం 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలే. తెలంగాణలో ప్రత్యర్థ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ స్థానాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ దక్కించుకుంది. దీనికితోడు ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణ కమలనాథుల్లో మరింత ఉత్సాహాన్నిపెంచాయి. ఇప్పుడు తెలంగాణలో రాబోయే అంసెబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. దీనికోసం జాతీయ నాయకులను రంగంలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సాక్ష్యం వచ్చే నెలలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా రెండు, మూడు సార్లు తెలంగాణలో పర్యటించనున్నట్లు వస్తున్న వార్తలే. ఏప్రిల్‌1 ఒక సారి.. అలాగే శ్రీరామనవమిని పురస్కరించుకొని భద్రాద్రికి మరొసారి.. దీంతో పాటు ఏప్రిల్ నెలల రెండో దశ బండి సంజయ్‌ పాదయాత్ర ఇంకోసారి అమిత్‌ షా రానున్నట్లు.. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం. దీని బట్టి చూస్తే.. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేసేందుకు.. డబుల్‌ ఇంజన్‌ ఫార్ములా వర్కవుట్ అవుతుందో చూడాలి మరి..

Exit mobile version