తెలుగు రాష్ట్రాల్లో లిల్లీ పూల సాగును ఎక్కువగా చేపడుతున్న అధిక లాభాలను పొందుతూన్నారు.. తెలుగు రాష్ట్రాలలో సంపంగి పూలు అని కూడా పిలుస్తారు. కంటికి ఇంపైన తెల్లని రంగు గల ఈపూలను పూలదండల తయారీలో విరివిగా వాడుతారు.. తక్కువ పూలతో సులభంగా, అందంగా పూలదండలు కూడా తయారు చేస్తారు. లిల్లీ పూలకు ఏడాది పొడవునా మార్కెట్ లో మంచి గిరాకీ ఉంటుంది. పట్టణ నగర ప్రాంతాల్లో లిల్లీ పూలకాడలను బొక్కెల తయారీకి ఎక్కువ ఉపయోగిస్తారు.. అలాగే వీటి మొక్కలను ఇంట్లో అలంకరణ లో ఉపయోగిస్తారు..
ఈ పూలకు ఎప్పటికి మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. రైతులు చేపడుతున్న సాగు విధానం. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అన్ని పంటల్లో లాగే లిల్లీ పంటలో కూడా పోషక లోపాలు, చీడపీడల బెడద ఎక్కువగానే కనిపిస్తోంది, ఈ అంశాల పైన రైతులు జాగ్రత్తగా ఉంటే లిల్లీ సాగు రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది.. ఎక్కువగా ఈ లిల్లీని దుంపల ద్వారా నాటుతున్నారు.. ఇక వాతావరణంలో మార్పులు వల్ల ఈ పంట తెగుళ్లు, చీడ పీడలకు గురవుతుంది.. ఎప్పటికప్పుడు తెగుళ్లను గుర్తించి సకాలంలో మందులు వాడితే తెగుళ్ల బెడద తగ్గుతుంది..
ఇకపోతే ఈ లిల్లీ మార్చి ఏప్రిల్ వరకు పూలు ఎక్కువగా వస్తాయి. అయితే ఎండ తీవ్రత అధికమైనప్పుడు దిగుబడి మాత్రం తగ్గిపోతుంది. మొదటి ఏడాది సాగు ఖర్చు ఎకరాకు 80వేల నుంచి లక్ష వరకు అవుతోంది. రెండో ఏడాది సాగు ఖర్చులు రూ. 40 వేల నుంచి రూ50 వేలు అవుతుంది. పూలను మధ్య దళారుల ద్వారా అమ్మితే కిలోకి రూ.50 లేదా రూ..60కి గిట్టుబాటు అవుతుంది. రైతు సొంతంగా అమ్ముకుంటే కిలోకి రూ. 75 నుంచి రూ90 వరకు మార్కెట్ లో ధర పలుకుతుంది.. అన్ని ఖర్చులు పోగా దాదాపు లక్ష వరకు ఆదాయాన్ని పొందుతారని నిపుణులు చెబుతున్నారు… మళ్లీ ఈ దుంపలను అమ్మి కూడా ఆదాయాన్ని పొందవచ్చు..