వర్షా కాలంలో మనుషులకే కాదు జంతువులకు కూడా అనేక వ్యాదులు వస్తుంటాయి..మేకలు, గొర్రెలు తినడం వల్ల వర్షాకాలంలో పలు వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే జీవాలు అనారోగ్యానికి గురై చనిపోతాయి. అందువల్ల రైతులు ఈ మూడు నెలలు అప్రమత్తంగా వుండాలి. వ్యాధులను గుర్తించగానే తగిన చికిత్స అందిస్తే జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుందని చెబుతున్నారు పశు వైద్య నిపుణులు.. జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పులు వల్ల వ్యాధులు అధికంగా రావటంతో మందలో మరణాల శాతం పెరిగి, రైతులు నష్టపోతున్నారు. ఎండాకాలం పోయింది. వర్షాకాలం వచ్చింది..
జంతువుల విషయంలో జనాలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈ వర్షాకాలంలో జంతువులకు ఎక్కువగా చిటుక రోగం, నీలి నాలుక, గాలికుంటు వ్యాధి, పిపిఆర్ రోగాలు వస్తాయి. వీటి నివారణ పట్ల అప్రమత్తంగా ఉండి, ముందుజాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలి. లేదంటే జీవాలు చనిపోయి తీవ్రనష్టం ఏర్పడుతుందంటూ తెలియజేస్తున్నారు.. ఇవి అంటూ వ్యాదులు కాబట్టి వీటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది.. లేకుంటే మొత్తం మందకు ఆ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ వర్షాకాలంలో జీవాల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గొర్రెలు లేదా మేకలు అనారోగ్యానికి గురైతే వెంటనే మందనుండి వేరు చేసి చికిత్స చేయించాలి. ముఖ్యంగా జీవాల మేపులో బలవర్థకమైన ఆహారం అందుబాటులో వుంచితే, వ్యాధినిరోధక శక్తి వృద్ధిచెంది పెరిగి, ఆరోగ్యంగా పెరుగుతాయి. వర్షాకాలంలో జీవాల పెంపకం దారులు నిర్లక్ష్యం వహిస్తే, అనారోగ్యానికి గురై చనిపోతాయి. దీనివల్ల ఆర్ధికంగా ఎంతో నష్టం కలుగుతుంది. అందుకే మందలో ఏదైనా జంతువు అనారోగ్యానికి గురైనట్లు తెలిస్తే దాన్ని మంద నుంచి వేరు చేసి సరైన వైద్యం చేయించాలని మర్చిపోకండి.. ఇక చిన్న జంతులను వర్షాల నుంచి ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉండాలి లేకుంటే అవి తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తాయి.. అందుకే ఏదైనా తేడాగా అనిపిస్తే వైద్యుల సలహాలను తీసుకోవడం మంచిది..