NTV Telugu Site icon

Viral video: ఇది ఐఫోన్ కాదు.. సాగరతీరం జంట వినూత్న ఆలోచన!

Viralvideo

Viralvideo

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే చేసుకునేది. దీన్ని ఎంతో గ్రాండ్‌గా.. గుర్తుండిపోయేలా ఒక వేడుకగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ప్రపంచమంతా చెప్పుకునేలా అంగరంగ వైభవంగా చేశారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను వందలాది మంది వీక్షించి ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది? అంతగా చర్చించుకునేలా అందులో ఏముందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Gottipati Ravi Kumar: ఇచ్చిన మాటలను ప్రభుత్వం నిలబెట్టుకుంది.. రాజముద్ర పునరుద్ధరణపై మంత్రి హర్షం

వైజాగ్‌కు చెందిన ఒక జంట తమ వెడ్డింగ్ కార్డును ఐఫోన్ మాదిరిగా డిజైన్ చేసి వినూత్నంగా బంధువుల్ని ఆహ్వానిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఐఫోన్ వెడ్డింగ్ కార్డును ఇన్‌స్ట్రాగామ్‌లో ఫోస్టు చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు సూపర్.. అదరహో అంటూ ప్రశంసిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mamata Banerjee: బెంగాల్ విభజన, కొత్త కేంద్రపాలిత ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం..

ఈ కార్డును మూడు పేజీలతో రూపొందించారు. బుక్‌లెట్ మాదిరిగా తయారు చేశారు. కవర్ పేజీలో ఫోన్‌ వాల్ పేపర్‌పై దంపతుల ఫొటో.. అలాగే వివాహ సమయం, తేదీ వివరాలు ప్రముఖంగా ముద్రించారు. రెండో పేజీలో వాట్సప్ సంభాషణ, తర్వాత వేదిక వివరాలు, వగేరా విషయాలు పొందిపరిచారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 15 మిలియన్ల వ్యూస్ వచ్చింది. కొందరు కార్డు బాగుంది. ఎంత ఖరీదైంది అని ఆరా తీశారు. ఇంకొందరు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. ఈ వెడ్డింగ్‌ కార్డు వీడియోను మీరు కూడా చూసేయండి.