Site icon NTV Telugu

Viral Videos: చంద్రయాన్‌-3 థీమ్‌తో గణేష్ మండపం.. ఎంత అద్భుతంగా ఉందో చూశారా?

Vinayaka Chavithi

Vinayaka Chavithi

సాదారణంగా వినాయక చవితి వచ్చిందంటే చాలు కొత్త కొత్త వింతలను చూస్తూ ఉంటాము.. బొజ్జగణపయ్యను మండపాల్లో కొలువుదీర్చి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాదిలాగే వివిధ రూపాల్లో గణేశుడి ప్రమండపాల్లోతిమలు కొలువుతీరాయి.. ఇప్పటికే ట్రెండ్ కు తగ్గట్లు వినాయకుడు విగ్రహాలను తయారు చేశారు.. కొన్ని వెరైటీ విగ్రహాలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. పోలీసు, జవానుగా, కర్షకుడిగా, వైద్యుడు, సినిమా హీరో.. ఇలా విభిన్న రూపాల్లో గణేశుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు.

ఈ క్రమంలో ఇటీవల ఇస్రో విజయవంతంగా పూర్తి చేసిన చంద్రయాన్‌-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్‌ అయిన విషయం తెలిసిందే. ఈ స్ఫూర్తితో ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌లో పలు గణేష్‌ మండపాలను చంద్రయాన్‌-3 థీమ్‌తో రూపొందించారు. ఇలాంటి ఒక గణేష్‌ మండపం నెట్టింట్లో వైరల్‌గా మారింది. చంద్రయాన్‌-3 నమూనాతో రూపొందించిన ఈ గణేషుడి వెనుక ఒక వైపు చంద్రయాన్‌-3 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్తుంది… తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌లో పలు గణేష్‌ మండపాలను చంద్రయాన్‌-3 థీమ్‌తో రూపొందించారు. ఇలాంటి ఒక గణేష్‌ మండపం నెట్టింట్లో వైరల్‌గా మారింది. చంద్రయాన్‌-3 నమూనాతో రూపొందించిన ఈ గణేషుడి వెనుక ఇంత అర్థం ఉందా అని ఈ వీడియోను చూసిన వారంతా తెగ కామెంట్స్ చేస్తున్నారు…

ఈ మిషన్‌ చంద్రుడి చుట్టూ పలుమార్లు తిరిగి.. అనంతరం విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై సాఫ్ట్‌ ల్యాండ్‌ అవుతుంది. దాని నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపైకి దిగుతుంది. విభిన్నంగా ఉన్న చంద్రయాన్‌-3 గణేష్‌ మండపానికి సంబంధించిన వీడియో క్లిప్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది… దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఆ వీడియోపై ఒక లుక్ వేసుకోండి..

Exit mobile version