Har Ghar Tiranga: ఇంటిపై జెండా కడుతూ కుప్పకూలిన వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Har Ghar Tiranga: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నడుస్తోంది. ఈ మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీంతో అందరూ తమ దేశభక్తిని చాటుకునేందుకు ఇళ్లపై జాతీయ జెండాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఓ వ్యక్తి తన ఇంటిపై జాతీయ జెండా కడుతూ విగతజీవిగా మారాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తి తన ఇంటి మిద్దెపై జాతీయ జెండా కడుతుండగా కరెంట్ తీగలు తాకడంతో అక్కడికక్కడే అతడు కుప్పకూలిపోయాడు. కరెంట్ షాక్ తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో ఇంటిపై జాతీయ జెండా కట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పలువురు హెచ్చరిస్తున్నారు. జాతీయ జెండాను ఏర్పాటు చేసే సమయంలో జాగ్రత్త వహించాలని లేదంటే ప్రమాదంలో పడే అవకాశం ఉందని సూచిస్తూ నెటిజన్లు ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నారు.
https://twitter.com/krishanKTRS/status/1558683770915811329
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
కాగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభాత భేరీలు, ప్రదర్శనలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కూడా తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్‌ను మార్చింది. కాషాయ జెండా స్థానంలో మూడు రంగుల జెండాను ఉంచింది.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!