19 ఏళ్ల వయసులో సాధారణంగా ఎవరైనా కాలేజీ చదువుతో లేదంటే ఖాళీ దొరికితే స్నేహితులతో కలసి షికార్లు కొడుతుంటారు. కానీ 19 ఏళ్ల కుర్రాడు ప్రదీప్ మెహ్రా అలా కాదు. చిన్న వయసుకే బాధ్యతలు తెలిసినవాడు. ఉత్తరాఖండ్‌లోని పల్మోరాకు చెందిన ఈ బాలుడు నోయిడాలోని సెక్టార్ 16లో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో పనిచేస్తుంటాడు. పొద్దున వెళితే.. అర్ధరాత్రి వరకు డ్యూటీ. దీంతో రాత్రి విధులు ముగిసిన తర్వాత 10 కిలోమీటర్ల దూరంలోని బరోలాలో ఉన్న తన ఇంటి…