NTV Telugu Site icon

Pune: చూస్తుండగానే రోడ్డు మధ్యలో దిగిపోయిన డ్రైనేజీ ట్యాంకర్.. వీడియో వైరల్

Puneaccident

Puneaccident

మహారాష్ట్రలోని పూణెలో వింతైన సంఘటన చోటుచేసుకుంది. పూణె నగరంలోని బుద్వార్ పేత్ ప్రాంతంలోని సిటీ పోస్టాఫీసు ఆవరణలో ఒక డ్రైనేజీ ట్యాంకర్ ఉంది. ట్రక్కు పూణె మునిసిపల్ కార్పొరేషన్‌కి చెందినది. డ్రైనేజీ క్లీనింగ్ పని కోసం అక్కడ ఆగి ఉంది. పని అయ్యాకు ట్యాంకర్ ముందుకు కదిలింది. అంతలోనే తలక్రిందులుగా భూమిలోకి కూరుకుపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Pomegranate benefits: దానిమ్మ పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో

ట్యాంకర్ వెనుక చక్రాలు ముందుగా మునిగిపోతాయి. అనంతరం పూర్తిగా దిగిపోయింది. అయితే డ్రైవర్ మాత్రం సురక్షితంగా తప్పించుకున్నాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

 

Show comments