బతుకు బండిని లాక్కెళ్లేందుకు ఒక్కొక్కరిది ఒక్కోక్క దారి. ఏదో ఒకలా సంపాదించి పొట్ట నింపుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఏదోలా నాలుగు రాళ్లు సంపాదించి కుటుంబాన్ని, పిల్లల్ని పోషించుకుంటారు. దొరికిన పని చేస్తూ.. డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అలాగే ఓ వ్యక్తి తన రెండు చేతులు లేకున్నప్పటికీ తానే డెలివరీలు చేయడమే కాకుండా స్కూటర్‌ను స్వయంగా నడుపుతున్నాడు.
READ MORE: Kohli-Maxwell: ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ అకౌంట్ బ్లాక్ చేసిన కోహ్లీ..!
వైరల్ అవుతున్న వీడియోలో.. ఈ డెలివరీ ఏజెంట్ తన రెండు చేతులను కోల్పోయినప్పటికీ కుటుంబాన్ని పోషించాలన్న తన తపన చూడొచ్చు. ఆ ద్విచక్రవాహనాన్ని ఎంతో ఆత్మవిశ్వాసంతో నడుపుతూ డెలివరీలు చేస్తున్నాడు. ఈ వీడియోను ఒక ఎక్స్ వినియోగదారు దీన్ని తన హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఇది బాగా వైరల్ అవుతోంది.
READ MORE:Kapil Dev – Chandrababu: ఏపీ ముఖ్యమంత్రితో కపిల్ దేవ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..!
వీడియో ప్రకారం.. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి చేతులు లేని డెలివరీ బాయ్‌ని చూసి.. అంకుల్.. మీరు స్కూటీని నడుపుతారా? అని ప్రశ్నించాడు. డెలివరీ ఏజెంట్ కూడా మర్యాదపూర్వకంగా చిరునవ్వుతో ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతాడు. ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షల్లో వీక్షణలు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానించారు. ఈ డెలివరీ ఏజెంట్‌ను ప్రజలు చాలా ప్రశంసిస్తున్నారు.
ఒక వినియోగదారు ఇలా రాశాడు. “వీరు పరిస్థితిని నిందించని నిజమైన హీరోలు.” కొంతమంది అన్ని బాగానే ఉన్నా కూడా ఏడుస్తూనే ఉంటారు. ఈయనను చూసి బుద్ధి తెచ్చుకోవాలని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు.
Massive RESPECT for This Zomato Delivery Man 🙏🙏 pic.twitter.com/Y0WtX88aGY
— Rosy (@rose_k01) October 25, 2024