NTV Telugu Site icon

Special Train: ఈ రైలు ‘రూటే’ సెపరేటు.. దటీజ్‌ వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌

Vivek

Vivek

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ కలిగిన ఇండియన్‌ రైల్వేస్‌లో వందల సంఖ్యలో రైళ్లు ఉన్నాయి. వేల సంఖ్యలో ట్రిప్‌లు తిరుగుతున్నాయి. లక్షల సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. కోట్లాది రూపాయల టర్నోవర్‌ని సొంతం చేసుకుంటున్నాయి. కానీ ఒక ట్రైన్‌ ఉంది. దాని పేరు వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌. ఈ రైలుకి ఎన్నో విశేషాలు ఉన్నాయి. అసలు దీని రూటే సెపరేటు. ఇది ఒకసారి బయలుదేరిందంటే ఏకంగా 4 వేల 2 వందల 73 కిలోమీటర్ల జర్నీని పూర్తిచేశాక గానీ తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించదు.

ఈ జర్నీకి 80 గంటల 15 నిమిషాల సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ పరుగులో భాగంగా 9 రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తూ 50కి పైగా స్టేషన్లలో ఆగుతుంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి మొదలుకొని అసోంలోని దిబ్రుగఢ్‌ స్టేషన్‌కి చేరుకోవటంతో ఒక వైపు ప్రయాణం ముగుస్తుంది. మళ్లీ తిరిగి అదే మార్గంలో వెనక్కి వస్తుంది. ఇలా ఒక ట్రిప్‌ పూర్తి కావటానికి దాదాపు వారం రోజులు పడుతుంది. వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ తొలిసారిగా 2011 నవంబర్‌లో ప్రారంభమైంది. స్వామీ వివేకానంద 150వ జయంతి(2013)ని పురస్కరించుకొని రెండేళ్ల ముందుగానే ఈ రైలుకి పచ్చజెండా ఊపారు.

అయితే ఈ రైలు మార్గాన్ని కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో నిలిపేశారు. ఇదిలాఉండగా వివేక్‌ రైలు రూట్‌ మన దేశంలోని అతి పొడవైన రైలు మార్గమే తప్ప ప్రపంచంలోనే పెద్దది మాత్రం కాదు. ఈ ఘనత రష్యా సొంతం. ఆ దేశంలో ఓ రైలు ఒకే మార్గంలో 9 వేల 2 వందల 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే మన వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ కన్నా రెట్టింపు మీద ఎక్కువేనన్నమాట. ఆ ట్రైన్‌ రష్యాలోని మాస్కో నుంచి వ్లాడివోస్టోక్ వరకు ప్రయాణిస్తుంది. దానికి కూడా ఒక ట్రిప్‌ పూర్తిచేయటానికి సుమారు ఏడు రోజులు పడుతుంది.

Naga Sourya: ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ కోసం లండన్ ప్రయాణం!