NTV Telugu Site icon

యూపీలో వ్యాక్సిన్ క‌ష్టాలు: అధికారుల‌ను చూసి పారిపోతున్న జ‌నాలు…

యూపీలో ఫిబ్ర‌వ‌రి నుంచి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఏడు విడ‌త‌ల్లో ఎన్నిక‌లు జర‌గ‌నున్నాయి.  ఈ ఏడు విడ‌త‌ల ఎన్నిక‌ల కోసం యూపీ అధికారులు సిద్దం అవుతున్నారు.  క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లు చేస్తున్నారు.  వ్యాక్సినేష‌న్ కోసం అధికారులు ప‌ల్లె ప్రాంతాల‌కు వెళ్లి వ్యాక్సిన్ అందిస్తున్నారు.  అయితే, బ‌లియా జిల్లాలో అత్య‌ల్పంగా వ్యాక్సినేష‌న్ జ‌రిగింది.  అక్క‌డి ప్ర‌జ‌లు వ్యాక్సిన్‌ను తీసుకోవ‌డానికి స‌సేమిరా అంటున్నారు. దీంతో అధికారులు బ‌తిమాలి, వ్యాక్సిన్‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ వ్యాక్సిన్ అందిస్తున్నారు.  అయితే, జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతాల‌కు వెళ్లిన అధికారులు వ్యాక్సిన్ అందించేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఓ వ్య‌క్తి అక్క‌డి నుంచి త‌ప్పించుకొని పారిపోయాడు.  మ‌రో వ్య‌క్తి పారిపోయి చెట్టు ఎక్కేశాడు.  త‌నకు వ్యాక్సిన్ వ‌ద్ద‌ని, తాను వ్యాక్సిన్ తీసుకోన‌ని, వ్యాక్సిన్ తీసుకుంటే చ‌చ్చిపోతాన‌ని ఆ వ్య‌క్తి చెప్పుకొచ్చాడు.  వ్యాక్సిన్‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు పాపం అధికారులు పెద్ద యుద్ద‌మే చేయాల్సి వ‌చ్చింది.  దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.  

Read: బ్రిట‌న్ కీల‌క నిర్ణ‌యం: వ‌చ్చే వారం నుంచి ఆంక్ష‌లు ఎత్తివేత‌…

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి