NTV Telugu Site icon

UP: ఓ షాపింగ్ మాల్‌లో కోతి హల్‌చల్.. కస్టమర్లకు చుక్కలు చూపించిన మంకీ

Upmall

Upmall

షాపింగ్ మాల్ అంటే కస్టమర్లతో రద్దీగా ఉంటుంది. పైగా మాల్‌లోకి ప్రవేశించే ముందు సెక్యూరిటీ, సిబ్బంది ఎప్పుడూ ఉంటారు. క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి పంపిస్తారు. అలాంటిది ఓ కోతి షాపింగ్‌ మాల్‌లోకి ఎలా ప్రవేశించిందో.. ఏమో తెలియదు గానీ నానా హంగామా సృష్టించింది. కస్టమర్లకు చుక్కలు చూపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Dil Raju: తెలంగాణ ప్రజానికానికి దిల్‌రాజు క్షమాపణలు..

ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీలోని సిటీ కార్ట్ మాల్‌లోకి అనూహ్యంగా ఓ కోతి ప్రవేశించింది. ఒకరి పైనుంచి ఇంకొకరిపైకి దూకుతూ హడలెత్తించింది. ఒక మహిళ తలపైకి ఎక్కి భయాందోళనకు గురిచేసింది. ఎక్కడికెళ్లినా వెంటాడుతూ ఉండేది. జుట్టు పీకడమే కాకుండా.. కరవబోయింది. ఆమె షూ లాక్కుంది. ఈ పరిణామాలతో భయాందోళనకు గురై రక్షించాలంటూ కేకలు వేసింది. సహాయం చేయాలంటూ అరిచింది. ఆమె నుంచి దూరం చేసేందుకు సహచరులు అరటిపండ్లు తినిపిస్తూ డైవర్ట్ చేశారు. అలాగే దుప్పట్లు విసిరి కాపాడే ప్రయత్నం చేశారు. మొత్తానికి యువతి తప్పించుకుని పారిపోయింది. ఇలా మాల్‌లో అల్లకల్లోలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొనుగోలుదారులు వీడియో రికార్డ్ చేశారు. అయితే ఈ ఘటనపై మాల్ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. మంకీ లోపలికి ఎలా వచ్చింది.. కస్టమర్ల కలిగిన అసౌకర్యంపై ఎవరూ స్పందించకపోవడం విశేషం. మంకీ విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Show comments